Rain Alert in Andhra Pradesh State : బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం రేపటిలోగా విస్తరించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం (డిసెంబర్ 15) రోజు అల్పపీడనంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
దీని ప్రభావంతో సోమవారం (డిసెంబర్ 16) ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం(డిసెంబర్ 17) కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. వ్యవసాయ పొలాల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పొగమంచుతో జాగ్రత్త : మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈరోజు రాష్ట్రంలోకి క్రింది స్థాయిగాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిక్కుల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.
అలర్ట్ : బంగాళాఖాతంలో మరో వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - తుపానుగా మారే ఛాన్స్ - రాబోయే 3 రోజుల్లో వర్షాలు