ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - 48 గంటల్లో మరింత బలపడే అవకాశం - ALERT ON HEAVY RAINS

అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తా వైపు కదిలే అవకాశం

Low_pressure_in_Bay_of_Bengal
Low pressure in Bay of Bengal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 6:43 AM IST

Updated : Oct 14, 2024, 7:21 AM IST

Low pressure in Bay of Bengal: దక్షిణ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తా వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ల రాదని హెచ్చరికలు జారీ చేశారు.

వెళ్తూనే ప్రతాపం చూపుతోన్న నైరుతి! అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు

భారీ వర్షాలు కురిసే అవకాశం: నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అప్రమత్తంగా ఉండాలి: భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్​కు దూరంగా ఉండాలని సూచించారు. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదని, పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు.

రేపు ప్రకాశం, శ్రీసత్యసాయి, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కాలువలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను-అప్రమత్తమైన ప్రభుత్వం

Last Updated : Oct 14, 2024, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.