ETV Bharat / state

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ- ఒకరు మృతి, 15 మందికి గాయాలు - lorry collided with RTC bus

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 4:49 PM IST

RTC Bus Accident in Annamaya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

RTC_Bus_Accident_in_Annamaya_District
RTC_Bus_Accident_in_Annamaya_District (ETV Bharat)

RTC Bus Accident in Annamaya District: అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర కడప- చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొందరిని కడప రిమ్స్ కు, మరికొందరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండడంతోపాటు, అధిక లోడుతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు - ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - Road Accident

లారీని ఢీకొన్న అంబులెన్స్ - ఆరుగురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - West Bengal Road Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.