ETV Bharat / state

గంగమ్మ ఒడికి 2 వేల గణనాథులు- కోలాహలంగా కేసీ కెనాల్‌ - Lord Ganesh Immersion Celebrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:27 AM IST

Lord Ganesh Immersion Celebrations in Kurnool District : కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జనం కోలాహలంగా సాగింది. వేలాది వినాయకులు గంగమ్మ ఒడికి చేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చేపట్టిన పటిష్ఠ బందోబస్తుతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

lord_ganesh_immersion_celebrations_in_kurnool_district
lord_ganesh_immersion_celebrations_in_kurnool_district (ETV Bharat)

Lord Ganesh Immersion Celebrations in Kurnool District : కర్నూలు నగరం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లంబోదరుడి శోభాయాత్ర ఘనంగా సాగింది. ఈ నిమజ్జన ఉత్సవాలు యువతీ యువకుల కేరింతలు, నృత్యాల నడుమ శోభాయమానంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరేగింపు శోభాయాత్ర చూసేందుకు నగరం నుంచేకాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలిరావడంతో నగరం జనసంద్రమైంది.

కర్నూలులో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గణనాథులు గంగమ్మ చెంతకు చేరారు. నగరంలో ఈ ఏడాది 2 వేలకు పైగా వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం నిమజ్జనం చేశారు.

Ganesh Nimajjanam 2024 : తొలుత పాత నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు ప్రారంభమైంది. మంత్రి టీజీ భరత్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాణాసంచా మోతల నడుమ శోభాయాత్ర జరిగింది. ఓల్డ్ సిటీలోని మిగిలిన వినాయకులు రాంబొట్ల గణపయ్యను అనుసరించాయి. నగర వాసులు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆట పాటలతో ఉత్సాహంగా పార్వతీ తనయుడిని గంగమ్మ చెంతకు తరలించారు.

కల్లూరు నుంచి రెండో శోభాయాత్ర, బళ్లారి చౌరస్తా నుంచి మూడు, వెంకటరమణ కాలనీ నుంచి నాలుగో శోభాయాత్ర నిర్వహించారు. అన్ని దారులూ కేసీ కెనాల్ వైపే అన్నట్లుగా సాగాయి. వినాయక ఘాట్ కు విగ్రహాలన్నీ చేరాయి. కర్నూలు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతిని మొదట నిమజ్జనం చేశారు. అనంతరం మిగిలిన విగ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేర్చారు.

వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు- 40 మందికి గాయాలు - Fire Accident in Ganesh Immersion

కేసీ కెనాల్‌ వద్ద 17 వందల మంది పోలీసుల బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనోత్సవం జరిగింది. సీసీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారు.

గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన కర్నూలు - ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి భరత్ - GANESH IMMERSION IN KURNOOL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.