ETV Bharat / state

మైక్‌లు బంద్‌ - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Election Campaign Concluded in Telangana : రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఇవాళ బ్రేక్​ పడింది. మైక్​లు బంద్​ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాలన్న ఈసీ ఆదేశాల మేరకు, అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు.

Lok Sabha Elections 2024
Election Campaign Concluded in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 6:00 PM IST

Lok Sabha Elections 2024 : రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్‌, వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. 51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియడంతో స్థానికేతరులు జిల్లాల నుంచి వెళ్లిపోవాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

అయితే తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో, సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్‌ పరిధిలో ప్రచారానికి బ్రేక్ పడింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్‌ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారనికి తెరపడింది.

ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉంటోంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచామని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారంపై నిఘా కొనసాగుతోంది. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సాయంత్రం 5 నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈవీఎం, వీవీప్యాట్​ల వాహనాలకు ప్రత్యేక నిఘా : పోలింగ్ కోసం తుదిఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారులని వికాస్‌రాజ్ ఆదేశించారు. ఈవీఎంలు వీవీ ప్యాట్‌లు తీసుకెళ్లే వాహనాలపై పకడ్బందీ నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ వాహనాలకు జీపీఎస్ పెట్టడంతో పాటు భద్రతా సిబ్బంది వెంట ఉండాలని స్పష్టం చేశారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూంల నుంచి బయటకు తీసేటప్పుడు పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్​సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్​ కేంద్రాల్లో 1,09,941 ఈవీఎం యూనిట్లు సిద్ధం చేశారు.

అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్​లో ఎన్నికలు - గంటపాటు సిబ్బంది సాహసం - 160 మంది కోసం! - Lok Sabha Elections 2024

రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు - ఎన్నికల తర్వాతే విడుదలకు ఆదేశం - EC Stopped Rythu Bharosa

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.