Dasara Liquor Sales in Combined Warangal District : తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా సందర్భంగా మద్యం విక్రయాలు ఆ రాష్ట్రంలోనే రికార్డును సాధించాయి. ఆ రాష్ట్రంలోనే అధిక పెరుగుదల నమోదైంది. వరంగల్ పట్టణ, రూరల్ పరిధిలో 49.88, జనగామ జిల్లాలో 89.87 శాతం విక్రయాలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. గతేడాది పండగ సందర్భంగా రూ.95.53 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి అదే 14 రోజుల్లోనే రూ.142.76 కోట్లకు చేరడం గమనార్హం. దాదాపు రూ.48.26 కోట్లు ఎక్కువగా జరిగాయి. ఈ నెల చివర్లో దీపావళి ఉండటంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆబ్కారీశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఏపీలో కొత్త మద్యం - కోరుకున్న బ్రాండ్లు - డిజిటల్ పేమెంట్లు - వైన్ షాపులకు క్యూ
ఇవీ కారణాలు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం విక్రయాలు ఎక్కువగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గొలుసు దుకాణాలు. గ్రామగ్రామాన కిరాణ దుకాణాలు, ఇళ్లల్లోనూ విక్రయిస్తున్నారు. సమయపాలన పాటించకుండా అవి తెరిచే ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు అది దొరుకుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర శివారులో గొలుసు దుకాణాలు ఎక్కువగా ఉండటంతో వారు వైన్స్‌ల నుంచి మద్యం తీసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో ఎక్కువ విద్యా సంస్థలు ఉంటాయి. యువత ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, పిల్లలకు విక్రయించలేదని చెప్పారు.
డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం : మరోవైపు ఏపీలోనూ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెండర్ల పక్రియ పూర్తికాగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఊరు పేరు లేని మద్యం ప్రజలకు అంటగట్టగా, ఇప్పుడు బ్రాండెడ్ సరకు వచ్చింది. దీంతో మందుబాబులు అధిక సంఖ్యలో మద్యం దుకాణాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
మందుబాబుల మందు చూపు- మద్యం దుకాణాల వద్ద బారులు! - Huge Crowd at Wine Shops
లిక్కర్ లాటరీలో ఎన్నో సిత్రాలు - బీజేపీ నేతకు 5 దుకాణాలు - మంత్రి నారాయణ 100 దరఖాస్తులు