ETV Bharat / state

గ్రామ సచివాలయంలో మద్యం బాటిళ్లు- తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు - Liquor Bottles at Sachivalayam

Liquor Bottles Seized at Grama Ward Sachivalayam: వైఎస్సార్సీపీ హయాంలో కాదే ప్రదేశం మద్యానికి అనర్హం అన్నట్లుగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలను సైతం అరాచకాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. తాజాగా సచివాలయంలో మద్యం బాటిళ్ల పట్టివేత నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది.

Liquor_Bottles_Seized_at_Grama_Ward_Sachivalayam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 4:59 PM IST

Liquor Bottles Seized at Grama Ward Sachivalayam: జగన్ సర్కార్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలు సైతం అరాచకాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిళాలు ఎరవేస్తున్నారు. వైసీపీ నేతలు తమ అరాచకాలకు ప్రభుత్వ కార్యాలయాలను సైతం వదలట్లేదు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సచివాలయంలో మద్యం బాటిళ్ల పట్టివేత ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంపై గ్రామ సచివాలయాల నిర్వహణపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో అధికార వైఎస్సార్సీపీపై ప్రతిపక్షాల విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.

325 మద్యం సీసాలు స్కానింగ్‌ - ఎస్​ఈబీ అధికారులకు చిక్కిన అధికారి - illegal liquor seized

వివరాల్లోకి వెళ్తే: కావలిలోని 17వ వార్డు బుడంగుంట సచివాలయంలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు సి.విజిల్ యాప్​ ద్వారా గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయం తాళంచెవులపై సరైన సమాచారం లభించకపోవడంతో, అధికారులు తలుపులు బద్దలు కొట్టి అందులో ఉన్న 43 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు అదే సచివాలయంలోనే నిల్వ చేసి ఉన్న రేషన్‌ బియ్యం వెలుగులోకి రావడంతో అధికారులు అవాక్కైయ్యారు.

ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇలా సచివాలయంలో అక్రమ మద్యం, రేషన్ బియ్యం దాచిపెట్టి చట్టవిరుద్దమైన కార్యకలపాలకు వైఎస్సార్సీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ మద్యం బాటిళ్లనే ఎన్నికల తాయిలాల కింద ప్రజలకు గుట్టు చప్పుడు కాకుండా వైఎస్సార్సీపీ నేతలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. సచివాలయం వద్దకు అధికారులు వెళ్లే లోపే 15కేసుల మద్యాన్ని తరలించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో మద్యం బాటిళ్లు నిల్వపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రిటైర్ బీఎస్​ఎఫ్​ జవాన్ ఇంట్లో 5లక్షల విలువైన మద్యం పట్టివేత - Retaired Jawan arrest in anantapur

"బుడంగుంట సచివాలయంలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు సి.విజిల్ యాప్ ద్వారా మాకు సమాచారం అందింది. దీంతో మేము సచివాలయంలో సోదాలు నిర్వహించగా 43 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. దీంతోపాపుట సచివాలయంలో నిల్వ చేసి ఉన్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం." - ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ అధికారి

ట్రైన్​లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

గ్రామ సచివాలయంలో మద్యం బాటిళ్లు- తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.