ETV Bharat / state

దాగుడుమూతల చిరుత - ఎక్కడుందో ! ఏమైందో? - Leopard Active at Diwancheruvu - LEOPARD ACTIVE AT DIWANCHERUVU

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దివాన్​ చెరువు అభయారణ్యంలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఆచూకీ కోసం 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లులను ఏర్పాటు చేశారు.

LEOPARD ACTIVE AT DIWANCHERUVU
LEOPARD ACTIVE AT DIWANCHERUVU (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 9:00 AM IST

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో పాగా వేసిన చిరుత జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత మంగళవారం ఓ రైతుకు తారసపడిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్, సీసీ కెమెరాలకు చిక్కలేదు. అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావడంతో అది ఎటువైపు వెళ్లిందన్న అంశంపై తీవ్ర భయాందోళన నెలకొంది.

ముమ్మరంగా గాలిస్తున్న అటవీశాఖ : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కోసం అటవీ సిబ్బంది అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతోంది. గత 22 రోజులుగా జనాల్ని హడలెత్తిస్తూ అటవీ శాఖను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుతపులి తప్పించుకొని తిరుగుతోంది. పాదముద్రలు సేకరించి చిరుత సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్థారించారు. 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం నర్సరీల్లో జల్లెడ పట్టారు. అయినీ ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు. భారీ వర్షం కురవడంతో పాదముద్రల సేకరణకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో కడియపు లంక, బుర్రిలంకలో తీవ్ర అలజడి నెలకొంది. జనం నర్సరీల్లో పనులు మానుకొని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.

రూటు​ మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest

మా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోందని అధికారులు చెబుతున్నారు. చిరుత ఇక్కడ తిరుగుందో లేదో మాకు తెలియదు. అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్​ కెమెరాల్లో చిరుత కనిపించడం లేదు. కానీ బయటకు వచ్చి నర్సరీల్లో పని చేయలంటే చాలా భయంగా ఉంది. చిరుత వల్ల మాకు పని కూడా లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం -నర్సరీ రైతులు

ఇంకా చిక్కని చిరుత - ట్రాక్​ కెమెరాల్లో కనిపిస్తున్నా! - LEOPARD ROAMING IN RAJAHMUNDRY

భయంగా కాలం వెళ్లదీస్తున్న జనం : చిరుత పులి నర్సరీల్లోనే ఉందా లేక వచ్చిన దారిలో దివాన్ చెరువు అభయారణ్యం వైపు వెళ్లిందా అన్నది తేలాల్సి ఉంది. అలాగే కడియం చుట్టుపక్కల మండపేట, ఆలమూరు వైపు పయనించిందా అన్న అనుమానాలు ఉన్నాయి. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కకపోవడం, జనాలకు కనిపించకపోవడంతో చిరుతపులి ఎటు వైపు సంచరిస్తోందన్నది తీవ్ర ఉత్కంఠ, భయాందోళన కలిగిస్తోంది.

పొలాల్లో సంచరిస్తున్న చిరుత - భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.