Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కడియపులంక దోసాలమ్మ కాలనీలో చిరుత సంచరిస్తున్నట్లు నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలు సేకరించి, వాటి ఆధారంగా చిరుతగా డీఎఫ్వో భరణి నిర్థారించారు. దీంతో నర్సరీ రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నర్సీరీ కార్మికులకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. చిరుత మాత్రం ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞుప్తి చేస్తున్నారు.
ఇంకా చిక్కని చిరుత - ట్రాక్ కెమెరాల్లో కనిపిస్తున్నా! - LEOPARD ROAMING IN RAJAHMUNDRY