ETV Bharat / state

'ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలు వీడలేదు' - కార్యకర్త హత్యపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేతలు - Fight Between TDP and YSRCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:56 PM IST

Leaders Angry with killing of TDP Worker in Anantapur District : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఆదెప్ప దారుణ హత్యను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ మాత్రం హత్యా రాజకీయాలను వీడటం లేదని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలను నమ్ముకున్న వైఎస్సార్​సీపీ ప్రజల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఆదెప్పను హతమార్చింది ఎంతటి వారైన ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Leaders Angry with killing of TDP Worker in Anantapur District
Leaders Angry with killing of TDP Worker in Anantapur District (ETV Bharat)

Leaders Angry with killing of TDP Worker in Anantapur District : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఆదెప్ప దారుణ హత్యను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ మాత్రం హత్యా రాజకీయాలను వీడటం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఆదెప్పను వైఎస్సార్​సీపీ గూండాలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ గూండాలు 9 మంది కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అనంతలో వైఎస్సార్సీపీ నాయకుల దుశ్చర్య - టీడీపీ కార్యకర్త దారుణ హత్య - tdp leader murder in anantapur

అధికారం కోల్పోయిన వైఎస్సార్​సీపీ నాయకులు పల్లెల్లో ఆధిపత్యం నిలుపుకోవడం కోసం హత్యా రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మెచ్చిరి గ్రామంలో తెలుగుదేశం నేత ఆదెప్పను హతమార్చడం హేయమైన చర్యని తెలిపారు. కిరాతకంగా ఆదెప్పను మట్టు బెట్టి వైఎస్సార్​సీపీ నాయకులు సాధించింది ఏంటని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపై తీసుకొచ్చి, పార్టీకోసం అహర్నిశలు పని చేసిన వ్యక్తి ఆదెప్ప అని కాలవ కొనియాడారు. ఆదెప్పను హతమార్చిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంతకులను పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. హత్యా రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ పార్టీ ప్రజల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ తరుఫున ఆదెప్ప కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.

నంద్యాల జిల్లాలో దారుణం - చిన్నారిపై ముగ్గురు మైనర్ల అత్యాచారం - ఆపై కాల్వలోకి తోసి - RAPE ON GIRL IN NANDHYAL DISTRICT

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు తెలుగుదేశం కార్యకర్త ఆదెప్ప హత్యే ఉదాహరణని అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అన్నారు. జిల్లాలో టీడీపీ నాయకుడు గొల్ల ఆదెప్ప హత్యను యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆదెప్ప భౌతికకాయాన్ని సందర్శించి, తెలుగుదేశం పార్టీ పతాకాన్ని కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదెప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని వారికి భరోసా కల్పించారు. అనంతరం పార్టీ నాయకలతో కలిసి వెంకటశివుడు యాదవ్ ఆదెప్ప పాడే మోశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెచ్చిరి గ్రామంలో టీడీపీ కార్యకర్త ఆదెప్ప హత్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పోలీసులు త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆదెప్ప కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు.

ఇంటి దగ్గరే వ్యాపారం చేస్తానన్నాడు - అంతలోనే హత్యకు గురయ్యాడు - అసలేం జరిగింది ! - Onion Trader Murder Case Mystery

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.