ETV Bharat / state

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వేగం పుంజుకుంటున్న ప్రచార హోరు - AP election campaigns - AP ELECTION CAMPAIGNS

Election Campaigns Across AP: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఊరు, వాడ అంటూ తేడా లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార, విపక్ష పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులు పోటాపోటిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.

Election Campaigns Across AP
Election Campaigns Across AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:11 PM IST

Election Campaigns Across AP: సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వేళ, అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కరపత్రాలు పంచుతూ ఎన్నికల్లో గెలిచాక చేయబోయే కార్యక్రమాలను, కూటమి అభ్యర్థులు ప్రజలకు వివరించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఉరవకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పయ్యావల కేశవ్‌ బెలుగుప్ప మండలంలో రోడ్‌షో నిర్వహించి, తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో కూటమి అభ్యర్థి ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేజర్ల మండలంలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలంలో ప్రచారం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నకరికల్లు మండలం చాళగుల్లులో ప్రచారం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారం నిర్వహించి... తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు వివరించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నంబొట్లవారి పాలెంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిన తీరును ప్రజలకు వివరించారు.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పామర్రు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌ రాజా, పమిడి ముక్కల మండలంలో ప్రచారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి జగన్ తీవ్ర అన్యాయం చేశారని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. విజయవాడ 45 వ డివిజన్ లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి, పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారం చేశారు.

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకు ? - వైఎస్ భారతిని నిలదీసిన వైఎస్సార్సీపీ నాయకుడు - PROTEST TO YS BHARATHI

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన భార్య కృష్ణతులసి దువ్వ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి విజయం సాధించడం ఖాయమని రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలసి రోడ్ షో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

హిందుపురంలో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన - Vasundhara Campaign in Hindupur

అన్నమయ్య జిల్లా సిద్ధవటం మండలంలో 100 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరాయి. రాజంపేట కూటమి అభ్యర్థి బాలసుబ్రమణ్యం వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు చెందిన 300 కుటుంబాలు వైసీపీ ని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కె.పూలకుంటలో 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్టలో 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వైసీపీ అరాచక పలానను తట్టుకోలేక వారంతా సొంత పార్టీని వీడారు. వైసీపీ అరాచకాలు చూడలేక ఆ పార్టీ వారే బయటకు వస్తున్నారని బాపట్ల జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు మండలాని చెందిన 100 వైసీపీ కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ లో తమకు తగిన గుర్తింపు దొరకడం లేదని విజయనగరానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి ఆథితి గజపతిరాజు వీరికి కండువా కప్పి పార్టీలో చేర్చుకన్నారు.

మే 13న ఓటుతో కొడితే వైఎస్సార్సీపీ కుంభస్థలం బద్దలవ్వాలి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Election Campaign

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పెరిగిన ప్రచార హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.