ETV Bharat / state

ఆ భూమి మాదంటే మాదే అంటున్న శ్రీశైలం దేవస్థానం- అటవీశాఖ అధికారులు! - Srisailam Temple Border Dispute - SRISAILAM TEMPLE BORDER DISPUTE

SRISAILAM TEMPLE BORDER DISPUTE: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలోని భూములపై దేవస్థానం, అటవీశాఖల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దేవస్థానం అభివృద్ధి చేసిన భూముల్లో అటవీ శాఖ సరిహద్దులు ఏర్పాటు చేయడంతో తెరపైకి వచ్చిన వివాదం, చివరికి శాంతి భద్రతల సమస్య వరకు చేరింది. ఏది ఏమైనా భక్తులకు ఇబ్బంది కలిగే చర్యలను నిలిపివేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.

Land Dispute Between Srisailam Devasthanam and Forest Department Officials
Land Dispute Between Srisailam Devasthanam and Forest Department Officials (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 12:47 PM IST

SRISAILAM TEMPLE BORDER DISPUTE : శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల సరిహద్దులపై గత రెండు రోజులుగా తీవ్ర వివాదం చోటు చేసుకుంటుంది . దేవస్థానం అభివృద్ధి చేసిన స్థలాలు తమకు చెందినవని అటవీశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. శ్రీశైలం అటవీశాఖ రేంజర్ నరసింహులు ఆధ్వర్యంలో శ్రీశైలంలోని టోల్గేట్, పాతాళ గంగ మార్గంలోని డార్మెంటరీలు, నంది సర్కిల్ వద్ద గుంతలు తీసి సరిహద్దుల స్తంభాలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు గుంతలు తవ్వి, బౌండరీలు ఏర్పాటు చేయడంపై దేవస్థానం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేెెశారు.

Lands Grab From Farmers : నిరుపేదల భూముల నుంచి భూములను లాక్కోవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వం

Srisailam Temple Border Dispute With forest Officers : శ్రీశైల దేవస్థానం -అటవీశాఖ భూముల సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించేందుకు గత రెండేళ్ల క్రితం రెవెన్యూ, అటవీ శాఖ ,దేవాదాయ శాఖ మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం శ్రీశైల దేవస్థానం -అటవీశాఖ భూముల సరిహద్దులను రీ సర్వే చేయించారు. రీ సర్వే చేపట్టి ఇప్పటికీ ఏడాది కాలం గడిచిపోయింది. రీ సర్వే ముగిసిన వెంటనే శ్రీశైల దేవస్థానానికి అవసరమైన అటవీ భూమి 1:2 ప్రకారం ఇవ్వాలని అప్పటి ఈవో ఎస్. లవన్న అటవీశాఖ ఉన్నత అధికారులకు లేఖ రాశారు. సదరు లేఖపై అటవీశాఖ ఉన్నత అధికారుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 20 ఏళ్ల కిందటి నుంచి దేవస్థానం అభివృద్ధి చేసిన స్థలాలు అటవీశాఖ పరిధిలోకి వచ్చాయని, వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రస్తుత చర్యలకు దిగడం సరికాదని దేవస్థానం సిబ్బంది సూచిస్తున్నారు.

టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య భూవివాదం - ఏఎస్‌ఐపై వైసీపీ నేత దురుసు ప్రవర్తన

సామాన్య భక్తులకు వసతి కల్పించే డార్మెంటరీ నిర్వహణకు ఆటంకం కలిగించేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న తీరుపై దేవస్థానం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం సిబ్బంది అటవీశాఖ సిబ్బంది చేపట్టిన చర్యలను అడ్డుకున్నారు. తవ్విన గుంతలను దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో పూడ్చివేత చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు ఇరు శాఖల అధికారులను పోలీస్ స్టేషన్​కు పిలిపించి విచారణ చేపట్టారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున దేవస్థానానికి, భక్తులకు ఇబ్బంది కలిగే చర్యలను నిలిపివేయాలని అటవీశాఖ సిబ్బందికి సూచించారు. దీంతో ప్రస్తుతానికి వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం పేర్లు మార్చడం ఏంటి? - అధికారులపై హై కోర్టు ఆగ్రహం - Lands Dispute Case in High Court

శ్రీశైలం దేవస్థానం - అటవీశాఖ అధికారుల మధ్య నెలకొన్న భూవివాదం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.