ETV Bharat / state

బోర్డులకే పరిమితమైనన రాష్ట్ర క్రీడా మైదానాలు - useless PlayGround In Telangana

Lack of Facilities at Sports Ground in Telangana : ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఉల్లాసానికి, శారీరక ధృడత్వానికి అలాగే యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. దీనికోసం గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాంగణాల పేరుతో 2022 జులైలో క్రీడా మైదానాలను ఆర్భాటంగా ప్రారంభించింది. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్ జంప్ కోర్టులతో పాటు వ్యాయామ పరికరాలు సిద్ధం చేశారు. అయితే కొన్నిచోట్ల పాఠశాల మైదానాలకే బోర్డులు తగిలించి అవే క్రీడా ప్రాంగణాలన్నారు. అవి చూస్తే బోర్డులకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల క్రీడా ప్రాంగాణాలు నిరుపయోగంగానే ఉన్నాయి. ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల అసలు లక్ష్యం నెరవేరకపోగా ఆటలాడేందుకు పంపిణీ చేసిన క్రీడా సామాగ్రి సైతం గ్రామాలు, పట్టణాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల దుస్థితి.

Players Facing for lack of Facilities for Sports Ground
Etv BharatLack of Facilities at Sports Ground in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 4:51 PM IST

బోర్డులకే పరిమితమయిన రాష్ట్ర క్రీడా మైదానాలు

Lack of Facilities at Sports Ground in Telangana : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామం, ఆవాసం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో గత ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన క్రీడా ప్రాంగణాల అసలు లక్ష్యం నెరవేరలేదు. మున్సిపాలిటీల్లో లక్ష్యం మేరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయకపోగా ఏర్పాటైనట్లుగా అధికారులు చెబుతున్నా, అవి వినియోగంలోకి రాలేదు. దాదాపు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి . ఉమ్మడి పాలమూరు జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా 385 వార్డుల్లో 434 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలి విడతలో 44 ప్రాంగణాల్ని అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. తర్వాత పట్టించుకున్న నాధుడే లేడు. అధికారులు పూర్తి చేసినట్లుగా చెబుతున్న ప్రాంగణాల్లో కనీస వసతులు లేవు. పేరుకు బోర్డులు తగిలించి ఖోఖో, వాలీబాల్ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.

వీటిని చదును చేసి ఆ తర్వాత వదిలేయడంతో క్రీడా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. స్థలాలు లేక కొన్నిచోట్ల పాఠశాల మైదానాలకే బోర్డులు తగిలించి వదిలేశారు. వీటిని కనీసం ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా పావు ఎకరం స్థలంలోనే సర్దుబాటు చేశారు. అరకొర వసతులతో, ఆడుకునేందుకు అనుకూలంగా లేని వాటిని సిద్ధం చేసి బిల్లులు మాత్రం దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రీడా ప్రాంగణాల పరిస్థితి గ్రామాల్లో ఇంకా తీసికట్టుగా ఉంది. ఉమ్మడి పాలముూరు జిల్లాలోని 2 వేల 278 గ్రామాలు, ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. కానీ 20 శాతానికి పైగా గ్రామాల్లో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. కారణం స్థలాభావం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడం.

కొన్నిచోట్ల పాఠశాల మైదానాల్లోనే వాలీబాల్, ఖోఖో, కబడ్డీ లాంగ్ జంప్ కోర్టులు ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఈ ప్రాంగణాల చుట్టూ మీటరు లోపు ఎత్తు పెరిగే మొక్కలు నాటాలి. అవేవీ లేకుండా తూతూ మంత్రం పనులు చేసినవే అధికం. కొన్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో వాటిని ఎవరూ వాడటం లేదు. పూర్తైన క్రీడా ప్రాంగణాల కోసం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కిట్లను సైతం అందించారు. వీటిలో క్రికెట్‌ కిట్‌, వాలీబాల్‌ కిట్‌, 75 టీ-షర్టులు, డంబెల్స్‌, డిస్కస్‌ త్రో, టెన్నీకాయిట్‌ రింగ్స్‌, స్కిప్పింగ్‌ రోప్స్‌, విజిల్స్‌, కొలతల టేపు లాంటివి ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 70 శాతం వరకూ కిట్లు పంపిణీ చేయగా 30 శాతం పంపిణీ చేయాల్సి ఉంది. పోనీ ఈ ప్రభుత్వంలో అవి పంపిణీ చేసినా ప్రాంగణాలు సరిగా లేకపోడంతో వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని యువత ప్రశ్నిస్తున్నారు.

Players Facing for lack of Facilities for Sports Ground : ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాలు సౌకర్యాలు లేక వెక్కిరిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక ఎకరం స్థలంలో క్రీడాప్రాంగణాలు నిర్మించాల్సి ఉండగా వెయ్యి గజాల్లోనే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సరైన స్థలాలు లేక బడి ఆవరణల్లోనే నెలకొల్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,475 గ్రామాలకు 610 గ్రామాల్లో 361 ఎకరాల భూమిని గుర్తించారు. సూర్యాపేటలో 679 గ్రామాలకు 322 గ్రామాల్లో 165 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 650 గ్రామాలకు 379 గ్రామాల్లో 177 ఎకరాల స్థలాన్ని 2022లో అధికారులు గుర్తించారు. క్రీడా ప్రాంగణాల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు.

ప్రస్తుతం నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అటు క్రీడా మైదానాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని అంటున్నారు. మరికొన్ని చోట్ల మైదానాలు ఉన్నా పిచ్చిమొక్కలు పెరిగాయి. కొన్నిచోట్లు కనీస సౌకర్యాలు, శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు లేకపోవడంతో క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయి. ఈ సందర్భంలో క్రీడా సామగ్రి సరఫరా చేసినా యువత, పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు. తాము ప్రస్తుతం ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నా పట్టించుకునే వారు లేరని యువత వాపోతున్నారు. వెంటనే క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా పరిధిలో మెుత్తం 647 గ్రామ పంచాయతీలుండగా వాటిలో 743 క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేశారు. వీటి కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. క్రీడా ప్రాంగాణాల్లో మాత్రం ఎటు వంటి మౌలిక సదుపాయాలు లేవని యువకులు చెబుతున్నారు. కేవలం అక్కడ ప్రభుత్వ బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. క్రీడా ప్రాంగాణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ ఆడుకోవడానికి స్థలాన్నికేటాయించారు. కానీ, అవి జనావాసాలకు దూరంగా ఎక్కడో పొలాల్లో, ముళ్ల పొదల మధ్య కేటాయించడంతో పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ స్థలాల్లో ముళ్ల పొదలు గుబురుగా పేరుకుపోయాయి. పిచ్చిమెుక్కలు పెరిగి ఆడవిని తలపిస్తున్నాయి. వాటిని అదునుగా చేసుకున్న మందుబాబులు అక్కడే మద్యం సేవిస్తూ అక్కడ ఖాళీ సీసాలను పగులగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Sports Ground Becoming Useless in Telangana : కొన్ని చోట్ల ‌క్రీడా ప్రాంగణాల్లో అక్రమంగా తరలిస్తున్న మట్టిని నిల్వ చేయడానికి వాడుకుంటున్నారు. మరి కొందరు ఆట స్థలాలనే కబ్జా చేస్తున్నారు. ఏకంగా ఆట స్థలాల్లో గదులు ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. అధికారులు మాత్రం మేము ఏర్పాటు చేసి పంచాయతీలకు అప్పగించాం కార్యదర్శులే వాటిని పర్యవేక్షించుకోవాలనే ధోరణిలో ఉన్నారు. మరికొన్ని చోట్ల చెత్త వేసుకోవడానికి, పశువుల పేడ, మేకలు, గొర్రెల ఎరువు నిల్వచేసుకోవడానికి వాడుకుంటున్నారు. పాఠశాలల్లో, పల్లె ప్రకృతి వనాల్లో ఉన్న క్రీడాప్రాంగాణాలు తప్ప మిగతా చోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగాణాల్లో పిచ్చి మెుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా చోట్ల క్రికెట్‌ కిట్లు, టీషర్టులు, ఇతర వ్యాయామ పరికరాలు గ్రామపంచాయతీల్లోనే ఉన్నాయి.

ప్రభుత్వం సదుద్దేశంతో క్రీడాప్రాంగాణాలను ఏర్పాటు చేయడానికి యోచిస్తే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాటిలో లాభాలు అర్జించేందుకు యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిగా ఉన్న స్థలాలను కాకుండా ఎవరికీ ఉపయోగపడని స్థలాలను మాత్రమే అధికారులకు చూపించి అక్కడ ఆట స్థలాలు ఏర్పాటు చేశారని రిటైర్‌ క్రీడాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే చెరువు కట్టలు, చెత్త వేసే ప్రాంతాల్లో క్రీడా ప్రాంగాణాలకు కేటాయించే వారేకాదనే ఆరోపిస్తున్నారు.

క్రీడా ప్రాంగణాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరితే గ్రామస్థాయి నుంచే క్రీడాకారులు తయారవుతారు. ప్రధానంగా ఆటలపై మక్కువ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న యువతకు ఈ క్రీడా ప్రాంగాణాలు చాలా మేలు కలిగిస్తాయి. ఈ ప్రభుత్వమైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రీడాప్రాంగాణాలను అందుబాటులోకి తీసుకొస్తే దేశానికి మంచి క్రీడాకారులను అందించడానికి అవకాశం ఉంటుంది.

తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ రేసింగ్‌ కారును తయారు చేసిన విద్యార్థులు- విశేషాలు ఇవే!

వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పైలట్‌గా మెళకువలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.