Kurnool Yemmiganur Ysrcp Candidate Butta Renuka: పేదలు... జీవితంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు తగిన ఆర్థిక సామర్థ్యం లేని వాళ్లు. పూట గడిచేందుకు పాట్లు పడేవారు. కానీ జగన్ దృష్టిలో పేదలంటే వేరే. అక్రమంగా లక్షల కోట్లు దోచుకున్న మన సీఎం దృష్టిలో పేదలంటే వందల కోట్ల ఆస్తులున్న వాళ్లే. దీనికి ఉదాహరణే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక.
నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక
బుట్టా రేణుక నిరుపేద: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో జగన్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని జగన్ పేర్కొన్నారు.
అఫిడవిట్ ప్రకారం బుట్టా రేణుక ఆస్తుల వివరాలు: కానీ రేణుక భర్త ఆస్తుల విలువ అఫిడవిట్ ప్రకారం 161.21 కోట్ల రూపాయిలు. చరాస్తులు 142.46 కోట్లు, స్థిరాస్తులు 18.75 కోట్లు. అప్పులు 7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు 242.60 కోట్ల రూపాయిలు. అంతేకాదు వీరికి ఆటోమొబైల్స్, హోటళ్లు, విద్యాసంస్థల వ్యాపారాలున్నాయి. హోండా, టాటా మోటార్స్ వాహనాల డీలర్‌షిప్ షిప్‌తో పాటు బుట్టా కన్వెన్షన్ హాలూ ఉంది. హైదరాబాద్‌లో మాదాపూర్, ఇజ్జత్‌నగర్‌లలో ప్లాట్లు, భవనాలున్నాయి.
చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఎర్రచందనం కేసులు - పెద్దారెడ్డిపై క్రిమినల్ కేసులు - Cases on YSRCP MLA Candidates
Three Cases Filed On Butta Renuka: బుట్టా రేణుకకు 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలున్నాయి. వీటి విలువే 2.54 కోట్ల రూపాయిలుగా అఫిడవిట్‌లో వెల్లడించారు. రేణుక భర్త పేరిట 435 గ్రాముల బంగారు నగలున్నాయి. బుట్టా దంపతులకు తేజస్వి జువెలర్స్‌లో 11.10 కోట్లు, తేజస్వి మోటార్స్‌లో 24 కోట్లు, బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 17.46 కోట్లు, బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 59.68 కోట్ల రూపాయిల విలువైన షేర్లు ఉన్నాయి. ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో (Economic Offenses Court) మూడు కేసులు నడుస్తున్నాయి. కర్నూల్లోనూ ఒక కేసు ఉంది.
శిల్పా చక్రపాణిరెడ్డి: శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. అఫిడవిట్ ప్రకారం, . 2014లో చక్రపాణిరెడ్డి, ఆయన భార్య, కుమారుడు ముగ్గురి ఆస్తి రూ.49.89 కోట్లు కాగా, అది 2019లో రూ.37.27 కోట్లు మాత్రమే. 2024కు వచ్చేసరికి 131. 71 కోట్లుగా, అప్పులు 28.24 కోట్లుగా పేర్కొన్నారు.