Kurnool District Tomato Farmers Happy Over High prices : టమోటా ధరల పెరుగుదల రైతుల్లో ఆనందం నింపుతోంది. మూడేళ్లలో అత్యధిక ధరలు పలికిన వేళ కర్నూలు జిల్లా టమోటా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు కురవక లాభాలు కాస్త తగ్గినా మొత్తమ్మీద ఈ ఏడాది కష్టాల నుంచి గట్టెక్కామని రైతులు అంటున్నారు.
కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో టమోటా సాధారణ సాగు విస్తీర్ణం 2 వేల 606 హెక్టార్లు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 14 వందల 51 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. పత్తికొండ, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా టమోటా సాగు చేస్తున్నారు. మొదట్లో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పంట దెబ్బతింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా ఈ ఏడాది మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిలాల్లోనూ టమోటా దిగుబడులు తగ్గిపోతుండటంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. గత 10 రోజులుగా క్రమంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవకపోవడం, మచ్చతెగులు రావడం వల్ల కొంతమేర తక్కువ ధరలు పలుకుతున్నాయి. అయినా పంటకు మంచి ధరే దక్కుతోందని రైతులు చెబుతున్నారు.
పడిపోయిన టమాటా ధరలు - పెట్టుబడి దక్కక రైతుల ఆందోళన - Tomato Prices Fall Down in AP
పత్తికొండ టమోటా మార్కెట్‌లో నాణ్యమైన పంటకు గరిష్ఠంగా కింటాకు 5 వేల 200 రూపాయలు పలికింది. నాణ్యత తక్కువగా ఉన్న పంటకూ గతంలో కన్నా మంచి ధరే పలుకుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో టమోటా వంద రూపాయల వరకు పలుకుతుండటం కొనుగోలుదారుల్లో మాత్రం ఆందోళన పెంచుతోంది.
'ప్రతి ఏటా టమోటా పంట పెట్టేవైళ్లం. మూడేళ్లుగా ఇలాంటి రేటు చూడలేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో మాకు మేలు జరిగింది. పెట్టుబడికి తగిన ఫలితం వస్తుంది. ఈ సారి వర్షాల కారణంగా పంట తక్కువ అయినప్పటికిీ రేటు బాగుంది. వర్షం వల్ల పంటకు తెగుళ్లు వచ్చాయి. ఇప్పుడేమో వర్షాలు లేక పంట ఎండిపోతుంది. ధర మంచిగా పలకడంతో పెట్టుబడి మాత్రం చేతికొచ్చింది. ' - టమోటా రైతులు
అనంతపురంలో జాతీయ రహదారిపై టమాటా రైతుల ఆందోళన - Tomato Farmers Agitation