ETV Bharat / state

50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 170 మంది - ఆర్టీసీ బస్సులను పెంచేదెప్పుడు : కేటీఆర్‌ - KTR On RTC BUS Tyres Blowout - KTR ON RTC BUS TYRES BLOWOUT

KTR On RTC BUS Tyres Blowout : జగిత్యాల జిల్లాలోని మోరేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు రెండు టైర్లు ఊడిపడిన ఘటనపై బీఆర్ఎస్​ నేత కేటీఆర్​ స్పందించారు. ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్యను ఎప్పటికి పెంచుతుందంటూ సోషల్ మీడియా ఎక్స్​ వేదికగా ఆయన ప్రశ్నించారు.

KTR On RTC BUS Tyres Blowout
KTR On RTC BUS Tyres Blowout (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 1:36 PM IST

KTR On RTC BUS Tyres Blowout : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను ఎప్పటికి పెంచుతుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మోరేపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు రెండు టైర్లు ఊడిపోయిన ఘటనపై ఆయన స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 170 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్ సామర్థ్యం కేవలం 50 మంది మాత్రమేనని కేటీఆర్​ తెలిపారు. ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదన్న ఆయన, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించటంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారని ఆర్టీసీని ప్రశ్నించారు. పనిభారంతో నలిగిపోతున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఏ విధమైన పరిహారం చెల్లిస్తున్నారో తెలపాలని పేర్కొన్నారు.

"ప్రభుత్వం బస్సులను ఎప్పుడు పెంచుతుంది? ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసేందుకు ఏవైనా భద్రతా చర్యలు తీసుకుంటున్నారా? అధిక పనిభారంతో సతమతమవుతున్న డ్రైవర్లకు మీరు ఎలాంటి పరిహారం చెల్లిస్తున్నారు" - కేటీఆర్ ట్వీట్

వసీమ్​ మరణానికి కారకులెవరు : మరో ట్వీట్​లో అధికార కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీ నాటికి జీతాలు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కేటీఆర్​ విమర్శిచారు. ఆత్మహత్యకు పాల్పడిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి వసీమ్​ ఘటనే ఇందుకు సాక్ష్యమంటూ ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వసీమ్​ 3 నెలలుగా జీతాలు లేక ఒత్తిడితో చనిపోయారని కేటీఆర్​ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, సూసైడ్ నోట్​ను సైతం ఎక్స్​లో పంచుకున్నారు. వసీమ్​ మరణానికి కారకులెవరని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయే : కేటీఆర్‌ - KTR Comments On CM Revanth Reddy

పల్లెల్లో పాలన పడకేసింది - పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది : కేటీఆర్​ - KTR ON VILLAGES AND TOWNS ISSUES

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.