Krishna Milk Union increase Milk Procurement Price : విజయ డెయిరీ బ్రాండ్‌గా పేరుగాంచిన కృష్ణా మిల్క్ యూనియన్ (KMU) పాల సేకరణ ధరను పెంచింది. యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాల సేకరణ ధరను లీటరుకు 10శాతం వెన్న గల పాలకు కిలోకు రూ.20 రేటును పెంచి కేజీ ప్యాట్‌కు రూ. 820 గా నిర్ణయించింది. ఆవు పాలు టోటల్ సాలిడ్స్కు రూ.10 రేటును పెంచి రూ. 285గా నిర్ణయించింది. వచ్చె నెల నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయని మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.
గాడిద పాలతో ఘరానా మోసం - లబోదిబోమంటున్న రైతులు
యువత కోసం ప్రోత్సహలు : రెండో విడత బోనస్ రేపు రూ.12 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మ్యాక్స్ లో ఉన్నందున ఆర్దిక లాభం లెక్కలు వేసుకుని బోనస్ లు ప్రకటిస్తున్నమన్నారు. ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతూనే ఉన్నామని చెబుతున్నారు. గ్రామాలలో ఉన్న యువత డైరీ ఫాం లపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహకాలు అందిస్తున్నమన్నారు. వినియోగదారుడి నుంచి తీసుకునే నగదులో 82 శాతం పాడి రైతులకు ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది సామాజిక మాధ్యమల ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని విజయవాడ నగర పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేశామని ఆంజనేయులు తెలిపారు.
చిక్కటి పాలు, ధర తక్కువ - మీరూ ఆ బ్రాండ్ల పాలు తాగుతున్నారా? - పేరు బాగుందని కొంటే అంతే!