Police Taken Innovative Efforts to Recover Lost Phone : ప్రస్తుత రోజుల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి జీవితం సెల్‌ఫోన్ చుట్టూ తిరుగుతోంది. చాలా మంది తమ వ్యక్తిగత అంశాలను అందులో భద్రపరచుకుంటుంటారు. అలాంటి ఫోన్ చోరీకి గురైనప్పుడు కొందరు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అందులో ఉన్న తమ సమాచారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెందుతుంటారు. అలాగే ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్‌లో వాహన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత వివరాలు భద్రపరచుకుంటున్నారు. అంత విలువైన ఫోన్ ఒక్క నిమిషం కనిపించకపోతే ఉక్కిరిబిక్కిరే. ఇక చోరీకి గురైతే చెప్పక్కరలేదు. అందుకే సెల్‌ఫోన్ పొగొట్టుకున్న బాధితుల కోసం కృష్ణా జిల్లా పోలీసులు వినుత్నంగా ఆలోచించారు.
ఈ నెంబర్కిి మెసేజ్ చేస్తే చాలు : చోరికి గురైన ఫోన్లను రికవరీ చేసే విషయంలో సులభతరం చేయటం కోసం కొత్త పద్ధతిని అమలు చేస్తున్నామని కృష్ణ జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఇప్పటి నుంచి ఫోన్ చోరికి గురైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే అవసరం లేకుండా 9490617573 కి మెసేజ్ చేస్తే సరిపోతుందని ఎస్పీ తెలిపారు. ఈ నంబర్‌కు 'HI' లేదా 'HELP' అని టైప్ చేసి పంపిస్తే చాలు వెంటనే సెల్‌ఫోనే చోరికి గురయ్యిందని అర్ధం చేసుకొని బాధితులకు ఒక లింక్‌ను పంపిస్తామన్నారు. అందులో ఫోన్‌కి సంబంధించిన వివరాలు కొన్ని నమోదు చేస్తే సరిపోతుందని తెలిపారు. అనంతరం IMEI నెంబర్ ద్వారా మెుబైల్ ఎక్కడ ఉందో ట్రేస్ చేస్తామన్నారు. చివరికి ఫోన్‌ను గుర్తించిన తరువాత బాధితులకు సమాచారం అందించి అప్పగిస్తామని వెల్లడించారు.
మొబైల్ ఫోన్ పోయిందా? ఆన్లైన్లో సింపుల్ రిక్వెస్ట్‌తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!
ఆ ఫోన్ల విలువ రూ. 45 లక్షలు : గత కొన్ని నెలలుగా కృష్ణ జిల్లా వ్యాప్తంగా చోరికి గురైన సెల్ఫోన్లను జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దాదాపు 390 ఫోన్లను రికవరీ చేసుకొని బాధితులకు అప్పగించామన్నారు. రికవరీ చేసుకున్న సెల్ఫోన్ల విలువ రూ.45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వీటిని గుడివాడకు చెందిన 202, మచిలీపట్నంకు చెందిన 96 మంది, పెనమలూరుకు చెందిన 90 మంది ఫిర్యాదుదారులకు పొగొట్టుకున్న ఫోన్లను తిరిగి అప్పగించినట్లు ఎస్పీ వివరించారు.
వారిని టార్గెట్ చేసుకొనే చోరీలు : కొందరు దొంగలు దారెంట ఒంటరిగా నడచుకుంటూ సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లే వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో బస్సులు, రైళ్లలోకి చొరబడి దొంగలు సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారని బాధితులు తెలుపుతున్నారు. చోరి చేసిన ఫోన్లను మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ కింద తక్కువ ధరకు అమ్మేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ : సెల్‌ఫోన్‌కు తప్పకుండా స్క్రీన్‌లాక్ చేసుకోవాలి. ఫోన్‌ను మెయిల్‌తో లింకు చేసుకొని ఉన్నట్లయితే.. అలాగే ఫొటోలు, వీడియోలు క్లౌడ్‌లో భద్రపరచు కొన్నట్లయితే.. సెల్ పోయిన వెంటనే వాటిని తొలగించవచ్చు. ఫోన్ చోరీకు గురైతే 5-10 నిమిషాల వ్యవధిలో అంతర్జాలంలో ‘ఫైండ్ మై డివైస్’ లోకి వెళ్లి ఎక్కడ ఉందనేది గుర్తించవచ్చు. ఫోన్ ఆన్‌లో ఉంటే పూర్తి డేటా తొలగించవచ్చు. ఫోన్ దొరగ్గానే ఆఫ్ చేసినట్టయితే వాటిలో ఫొటోలు, వీడియోలు తీసివేయటం కష్టమవుతుంది. వ్యక్తిగత అంశాలను మెమొరీ కార్డు, ఫోన్‌లో ఉంచకపోవటం ఉత్తమమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
How to buy Second Hand Phone Legally? : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. ఈ విషయం తెలుసా..?!