Konaseema Coconut Farmers Struggle Due to Coconut Prices Fall : అసలే అంతంతమాత్రం దిగుబడులు ఆపై ధరల పతనం కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీస్తోంది. తమిళనాడు, కేరళ కొబ్బరి నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు చితికిపోతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో విరివిగా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Coconut Prices Decrease : వైశాఖ మాసంలో శుభకార్యాలు, పూజాది క్రతువులు జరిగే క్రమంలో కొబ్బరికి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కొబ్బరి ధరలు పెరుగుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఈసారి కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితులు తారుమారయ్యాయి. దిగజారిన దిగుమతులకు తోడు ధరలు పతనమై మార్కెట్ కుదేలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే రైతులు ఆశించిన మేర కొబ్బరి కాయకు ధర రావట్లేదు. పరిమాణం, నాణ్యత దృష్ట్యా కోనసీమ కొబ్బరికి పొరుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన పోటీ ఉంటోంది. తమిళనాడు కాయతో నెగ్గుకురాలేక అంబాజీపేట కొబ్బరి మార్కెట్ బేలచూపులు చూస్తోంది. కనీస ఆదాయం కరవవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తమిళనాడులో ఎకరా కొబ్బరి తోటలో వెయ్యి నుంచి 1500 కాయలు వస్తున్నాయి. కోనసీమలో మాత్రం ఎకరా కొబ్బరి తోటలో దింపు తీస్తే 300 నుంచి 400 కొబ్బరి కాయలు కూడా పడటం లేదని రైతులు కలత చెందుతున్నారు. గత ఐదారు నెలలుగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కాయ ధర కూడా నిలకడగా ఉంది. మార్కెట్‌లో డిమాండ్ బాగుంటే కోనసీమ నుంచి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొబ్బరి కాయలు ఎగుమతి అవుతాయి. ప్రతికూల పరిస్థితులు వల్ల అక్కడి నుంచి పెద్దగా ఆర్డర్లు రావడం లేదు. తమిళనాడు కాయల నాణ్యత, పరిమాణం మనకంటే మెరుగ్గా ఉంటాయి. ఇతర రాష్ట్రాల వర్తకులు వాటిపైనే మక్కువ చూపడం వల్ల ఆ రాష్ట్రాల కొబ్బరికాయలకు డిమాండ్ ఏర్పడుతోంది.
కోనసీమలో కొబ్బరి తోటలకు తెగుళ్లు, పురుగులు వ్యాపించడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఆశించిన స్థాయిలో కాయ దిగుబడి రావడం లేదు. అదే సమయంలో సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ఐదారు నెలలుగా కొబ్బరికాయకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతుల్ని కుంగదీస్తోంది.
ధరలు పతనమైనప్పుడు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు కోనసీమలో విరివిగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అసలైన రైతులకు మేలు చేసేలా నాఫెడ్ కేంద్రాల్లో నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
Coconut farmers protest కలెక్టరేట్ ఎదుట కొొబ్బరి రైతుల నిరసన.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్