ETV Bharat / state

మేనమామ ఇంటిని కొట్టేసిన మంత్రి ఉషశ్రీ దంపతులు - Usha sri Charan Couple Cheating - USHA SRI CHARAN COUPLE CHEATING

Minister Usha sri Charan Couple Cheated Their Own Uncle : అధికారం పార్టీ నేతల దోపిడీకి రాష్ట్రమంతా వెలవెల బోతుంది. కేవలం ప్రజలు మాత్రమే కాదు సొంత కుటుంబీకులను సైతం మోసం చేసే రేంజ్​కి దిగజారారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు. దానికి నిదర్శనమే మంత్రి ఉష శ్రీ చరణ్​ల ఉదంతం.

minister_usha_sri_charan_couple_cheated_their_own_uncle
minister_usha_sri_charan_couple_cheated_their_own_uncle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 4:27 PM IST

మేనమామ ఇంటిని కొట్టేసిన మంత్రి ఉషశ్రీ దంపతులు (ETV Bharat)

Illegal activities of Usha Sri Charan : రాష్ట్రంలో దేన్నీ వదిలిపెట్టకుంటా వైఎస్సార్సీ సారథి తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మరీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. యతా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ పార్టీ నేతలు కబ్జాల పర్వానికి తెర లేపారు. వాళ్ల కన్ను పడ్డ ప్రతీదీ ఖాతాలో పడాల్సిందే అన్నట్లు యథేచ్ఛగా దోచుకున్నారు. మంత్రులు, ముఖ్య నేతల అండతో ఎన్నో అరాచకాలు సాగించారు. అయితే మంత్రి ఉష శ్రీ చరణ్​ భర్త సొంత మేన మామ ఇంటి తన పేరుమీదకు మర్చుకుని వారి కుటుంబాన్ని రోడ్డున పడేశాడని బాధితులు వాపోయారు.

Minister Usha sri Charan Couple Cheated Their Own Uncle : పెనుకొండ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి ఉష శ్రీ చరణ్ దంపతుల అక్రమాలకు అడ్డూఅదుపు లేదు. వారి కన్ను పడిదంటే చాలు బంధువుల భూమైనా పరాయివాళ్లదైనా ఆక్రమించాల్సిందే. బెంగళూరులోని సింగనాయకనహల్లిలో ఉష శ్రీ చరణ్ దంపతుల భూ కబ్జా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నప్పటినుంచి ఆలనా పాలనా చూసిన సొంత మేనమామనే మోసం చేశారు ఉష శ్రీ దంపతులు. చరణ్ రెడ్డి మేనమామ జగన్నాథం రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సొంతిళ్లు కట్టుకున్నారు.

మంత్రి ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ - పార్టీ మారేందుకు సిద్ధమని కార్యకర్తల హెచ్చరిక

YCP Leader Anarchy : వీరింటికి సమీపంలో కొద్దిగా స్థలం కొన్నానని అక్కడకు వెళ్లేందుకు 30 అడుగుల స్థలం కావాలని మంత్రి భర్త చరణ్ రెడ్డి తన మామ జగన్నాథాన్ని కోరడంతో ఆయన కాదనలేక స్థలం రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే మూడు నెలల క్రితం జగన్నాథం ఇంటికి వచ్చిన కరెంటు బిల్ చరణ్ రెడ్డి పేరు మీద రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. 30 అడుగుల స్థలం పేరిట మొత్తం ఇంటినే కబ్జా చేశారని కోర్టును ఆశ్రయించారు. అయినా న్యాయం జరగపోవడంతో జగన్నాథం మనస్తాపానికి గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్చారు. తమకు తీరని అన్యాయం చేశారంటూ జగన్నాథ్ భార్య నాగవేణి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిసిన పలువురు మంత్రి దంపతులు చేసిన నిర్వాకానికి ముక్కున వేసుకున్నారు.

'ఇన్‌ఛార్జి'ల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవో కు క్యూ కట్టిన నేతలు

'ఆత్మీయ పలకరింపు' - రోడ్లేయమని అడిగితే కారెక్కి వెళ్లిపోయిన మంత్రి ఉషశ్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.