ETV Bharat / state

పెళ్లి సందడికి వేళాయే - శుభ ముహుర్తాలివే!

లోగిళ్లలో హడావుడి - దుకాణాల్లో సందడి

WEDDING_SEASON_STARTED
WEDDING_SEASON_STARTED (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Wedding Season Started : కల్యాణ ఘడియలు రావడంతో లోగిళ్లలో హడావుడి, దుకాణాల్లో సందడి కనపడుతోంది. దాదాపు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరారవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మొదలైంది. రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన కన్వెక్షన్లు, గార్డెన్స్, కల్యాణ మందిరాలు కలకల లాడునున్నాయి.

కార్తీక మాసం మొదలుకావడంతో ( నవంబర్​ 1 నుంచి) రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కో వివాహానికి 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయనున్నారు. వచ్చే నెలలో (నవంబర్​) 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబరులో 4, 5, 9, 10, 11, 14, 15, 16వ తేదీలు శుభప్రదమైన రోజులుగా పండితులు చెబుతున్నారు.

వరుడు మైనర్‌-వధువు మేజర్‌ - ప్రేమపెళ్లిలో ట్విస్ట్​

వివిధ వృత్తుల వారికి ఉపాధి : పురోహితులు, మంగళ వాయిద్యాలు, రజకులు, బంగారం, వెండి ఆభరణాల తయారీ, వస్త్ర దుకాణాలు, నిత్యావసరాలు, విస్తరాకులు తయారు చేసే స్వయం ఉపాధి సంఘాలు, తాంబూలాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, దండలు, అద్దె కార్లు, కళాకారులు, ఐస్‌ క్రీం, విద్యుత్తు, వేదిక అలంకరణ, మైక్‌ సెట్లు, విందు భోజనం తయారు, షామియానా తదితర వృత్తిదారులకు ఉపాధి లభిస్తుందని ఆర్థిక చెబుతున్నారు.

చేతి నిండా పని : ఒక్కో వివాహ శుభకార్యంలో సగాటున ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి పని దొరుకుతుంది.

ప్రముఖుల రాకతో సందడి : రాష్ట్రంలో జరిగే ప్రముఖుల కుటుంబ సభ్యుల వివాహానికి గవర్నర్, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నత న్యాయస్థానాల జడ్జిలు, రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల రాకతో మరింత సందడి నెలకొంటోంది.

"పుత్తడిబొమ్మ పూర్ణమ్మ" కష్టం - పెళ్లి పంజరంలో బంగారు బాల్యం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 10 వేల మందికి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రంలోనే అతి పెద్ద, అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన కన్వెక్షన్లు, గార్డెన్స్, కల్యాణ మందిరాలు పెనమలూరు, కంకిపాడు మండలాల్లో 7 ఉన్నాయి. మధ్యస్త వేదికలు 30కి పైగా, 200 నుంచి 300 మంది బంధుమిత్రులకు సరిపోయేవి మరో 15 ఉన్నాయి. వణుకూరు, గండిగుంట, ఆకునూరు, పెనమలూరు, కంకిపాడు, ప్రొద్దుటూరు, కోలవెన్ను తదితర 3 మండలాల్లోని గ్రామాల్లో సామాజిక భవనాలు 12 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్​ కల్యాణ మండపాల్లో సగం మేర ఏడీ వంటి సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

పెళ్లి కోసం అప్పు - లాభమా? నష్టమా? ఆర్థిక నిపుణుల మాటేంటి? - Wedding With Personal Loan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.