ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు - Kanipaka Vinayaka Brahmotsavams - KANIPAKA VINAYAKA BRAHMOTSAVAMS

Kanipaka Vinayaka Brahmotsavam: చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ వేడుకలు 21 రోజులపాటు కన్నుల పండువగా జరగనున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.

KANIPAKA VINAYAKA BRAHMOTSAVAMS
KANIPAKA VINAYAKA BRAHMOTSAVAMS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 12:44 PM IST

Kanipaka Vinayaka Brahmotsavam Started Grandly : కోరిన కోర్కెలు తీర్చే గణపయ్య శివపార్వతుల ముద్దుల తనయుడు చిత్తూరు జిల్లాలోని స్వయంభూ శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో మొదలైన ఈ వేడుకలు ఇవాళ్టి నుంచి 21 రోజులపాటు కన్నుల పండువగా జరగనున్నాయి. గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల ధగధగలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వినాయకచవితి పర్వదినాన ఉదయం అభిషేకంతో ప్రారంభమయ్యే గణనాయకుని బ్రహ్మోత్సవాల్లో 21 రోజులపాటు స్వామి నిర్విఘ్నంగా పూజలందుకుంటూ వివిధ వాహన సేవలతో భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. పూర్వం నుంచి స్వామివారి ఆలయానికి కాణిపాకం సహా చుట్టు పక్కల 14 గ్రామాల ప్రజలు పూజలు చేసుకునేవారు. ప్రత్యేకించి స్వామి వారికి 21 సంఖ్య ప్రీతిపాత్రమైనది కావటంతో 14 గ్రామాల్లోని 21 ప్రధాన కులాలకు చెందిన స్వామివారి భక్తులు ఏలుబడిలో ఆలయం ఉండటంతో నాటి నుంచి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించంట ఆనవాయితీగా వస్తోంది.

అయినవిల్లి గణపయ్య గుడికి వెళ్లారా? ఒక్క కొబ్బరికాయ కొడితే మీ సమస్యలన్నీ క్లియర్! - Ainavilli Vinayaka Temple

ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రోజూ ఉదయం అభిషేకం రాత్రికి హంస, నెమలి, మూషిక, పెద్ద శేష, వృషభ, గజ, అశ్వ, రావణబ్రహ్మ, యాలి ఇలా ఒక్కో రోజూ ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. వినాయక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆలయం మొత్తాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అదనంగా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేయటంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో వసతి సౌకర్యాలను మెరుగుపర్చారు.

ఉచిత అన్న ప్రసాదం, అదనంగా లడ్డూల తయారీపైనా అధికారులు దృష్టి సారించారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దారి పొడవునా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బొజ్జ గణపయ్యను ఎక్కువ మంది దర్శించునేలా ఏర్పాట్లు భారీ ఎత్తున చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలనే కృత నిశ్చయంతో ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయంతో కృషి చేస్తున్నారు.

తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA CHAVITHI Festival in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.