Kalki 2898 AD Movie Old Temple in AP: ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. సినిమాలో, తొలుత రిలీజ్ చేసిన ట్రైలర్లో ఎక్కువగా ఓ పురాతన ఆలయాన్ని చూపించారు. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్ల పాటు అమితాబ్ బచ్చన్ ఉన్నట్లు చూపించారు.
ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో చిత్రం చూపించిన దేవాలయం ఎక్కడ ఉందో అని ప్రభాస్ అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దీంతో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అభిమానుల కోసం ఈటీవీ భారత్ టీమ్ దీని గురించి తెలుసుకుంది. ఈటీవీ భారత్ చేసిన పరిశీలనలో ఈ పురాతమైన ఈశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. నెల్లూరి జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే అది అనే ప్రచారం జరుగుతోంది.
రికార్డు స్థాయిలో కల్కి ఓపెనింగ్స్- ఎన్ని కోట్లంటే? - Kalki 2898 AD Collections
నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు సమాచారం. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850 వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది. అంతేకాదు పెన్నా నదికి వచ్చే వరదలు గ్రామాలను ముంచెత్తడంతో 200 ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్రమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు.
ఇసుక తవ్వకాల్లో బయటపడిన ఈ ఆలయం గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. ఆలయం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు.
'కల్కి' కలెక్షన్ రికార్డ్స్‌పై నిర్మాత స్పప్న దత్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఏది ఏమైనా కల్కి 2898 ఏడీ మూవీతో నెల్లూరు జిల్లాలోని నాగేశ్వర స్వామి ఆలయం వార్తల్లో నిలిచింది.