ETV Bharat / state

కాకినాడ వైద్యుల ప్రతిభ - 'అదుర్స్' మూవీ చూపిస్తూ రోగికి బ్రెయిన్​ ఆపరేషన్ - Kakinada GGH Rare Brain Surgery - KAKINADA GGH RARE BRAIN SURGERY

Kakinada GGH Rare Brain Surgery : 'సినిమా చూపిస్తూ సర్జరీ' వినేందుకు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనండీ. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళా రోగికి ఇష్టమైన సినిమా చూపిస్తూ సర్జరీని విజయవంతగా జరిపారు వైద్యులు​. క్లిష్టమైన సర్జరీ అనగానే అందరికీ టక్కున గుర్తుచ్చేదీ కార్పొరేట్ ఆసుపత్రే కానీ, తెలివికి, టాలెంట్​కు ఢోకా లేని ఎంతోమంది అత్యుత్తమ వైద్యులు ప్రభుత్వం ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వహిస్తుంటారు. ఇదే విషయాన్ని కాకినాడలోని సర్వజన ఆసుపత్రి వైద్య బృందం తాజా సర్జరీతో నిరూపించారు. అరుదైన చికిత్స చేసి వైద్యులు ఓవైపు ప్రశంసలందుకుంటుంటే, మరోవైపు సినిమాల ప్రభావం మామూలుగా లేదు కదా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Rare Brain Surgery in Kakinada GGH
Rare Brain Surgery in Kakinada GGH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 1:02 PM IST

Kakinada GGH Doctors Brain Surgery to Patient : కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) మంగళవారం మధ్యాహ్నం, ఓ మహిళా పేషెంట్​ చేతిలో ట్యాబ్‌ ఉంది. తనకు ఇష్టమైన ‘అదుర్స్‌’ మూవీలోని జూనియర్‌ ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుమ నడిచే హాస్య సన్నివేశాలను ఆమె చూస్తున్నారు. సినిమాలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులో ఏర్పడిన కణితి తొలగింపు శస్త్రచికిత్సను వైద్యబృందం పూర్తిచేసింది. మెలకువలో ఉండగానే (అవేక్‌ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ సర్జరీని పూర్తి చేయడం ద్వారా వారు ప్రశంసలందుకున్నారు.

కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ డిపార్ట్​మెంట్​ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)కి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి తీవ్రంగా లాగుతుంది. ఆమెను పలు కార్పొరేట్​ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల డాక్టర్లు తెలిపారు. ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా అనంతలక్ష్మిని కాకినాడలోని జీజీహెచ్‌లో చేర్పించారు.

‘అదుర్స్‌’ మూవీ ఆనందంలో ఉండగా : వైద్యులు పరీక్షించి అనంతలక్ష్మి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దానిని తొలగించారు. ‘అదుర్స్‌’ మూవీ చూపిస్తూ అనంతలక్ష్మి ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు.

అనంతరం ఆమె లేచి కుర్చున్నారని, టిఫిన్​ తీసుకున్నారని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని చెప్పారు మరో ఐదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జ్ చేస్తామని పేర్కొన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్​మెంట్​ సాగిందని వైద్యులు వివరించారు.

ఇబ్బందులు తెలుసుకుంటూ : శస్త్రచికిత్స సమయంలో వైద్యులు అడిగే ప్రశ్నలకు సాధారణంగా రోగులు సమాధానాలు చెబుతారు. తద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చని జీజీహెచ్‌ అనస్తీషియా హెచ్‌వోడీ డా.ఎ.విష్ణువర్థన్, న్యూరోసర్జరీ విభాగం అధిపతి డా.విజయశేఖర్‌ వివరించారు. వైద్య బృందంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.డీకే గిరిరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.కార్తీక్, డా.టి.గౌతమ్, డా.గోపి, పీజీ వైద్యులు డా.అరవింద్, డా.సాయితేజ, డా.సాయిరాం, డా.శ్రావణి, డా.ఆనంద్‌. డా.అబు తదితరులు సహకారం అందించినట్లు వెల్లడించారు.

బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్​ చాలీసా పారాయణం

వైద్య చరిత్రలోనే అద్భుతం​.. గర్భంలో ఉన్న పిండానికి బ్రెయిన్ సర్జరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.