Kaisika Dwadashi Celebrations in Tirumala Srivari Temple : తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానంను టీటీడీ వైభవంగా నిర్వహించింది. బుధవారం వేకువజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలి వద్ద వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఏడాదిలో కైశిక ద్వాదశి పర్వదినం రోజునే సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 3నెలల నిరీక్షణా! - అదేం పద్ధతి గోవిందా!
తణుకులో వైభవంగా కార్తిక దీపోత్సవం - ఓంకార నాదాలతో హోరెత్తిన మైదానం