ETV Bharat / state

వర్రా ఎస్కేప్ - పోలీసులపై ప్రభుత్వం సీరియస్‌ - ఇంటెలిజెన్స్​కు ఆదేశాలు - VARRA RAVINDRA REDDY UPDATES

పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని వదిలిపెట్టిన పోలీసులు - ప్రభుత్వం ఆగ్రహం

kadapa_police_searching_for_varra_ravindra_reddy
kadapa_police_searching_for_varra_ravindra_reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 4:55 PM IST

Kadapa Police Searching for Varra Ravindra Reddy : వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు వదిలేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. కడప తాలూకా పోలీసులు బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డికి 41-ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడపలోని ఎస్పీ కార్యాలయానికి కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో సమావేశమయ్యారు. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆయన ఆరా తీశారు.

వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా వర్రా రవీంద్రారెడ్డి అడ్డూ అదుపూ లేకుండా మితిమీరి ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, వంగలపూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారించారు. అనంతరం బుధవారం 41-ఏ నోటీసు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలంటూ వదిలిపెట్టారు. మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మళ్లీ వెళ్లగా వర్రా రవీంద్రారెడ్డి తప్పించుకున్నారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. రవీంద్ర ఆచూకీ కోసం బుధవారం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని చింతకొమ్మదిన్నె పీఎస్‌లో విచారిస్తున్నారు.

రవీందర్‌రెడ్డికి నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు - సీఎం చంద్రబాబు సీరియస్​

పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుడు కనసన్నల్లో రవీందర్ రెడ్డి ఉండటంతో అతనికి కూడా పోలీసులు ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం. ఐదేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లక్ష్యం చేసుకుని పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి అంతటితో ఆగకుండా సునీత, షర్మిల, విజయమ్మ పైన కూడా అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెట్టి వేధించారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తి పోలీసులకు చిక్కితే తగిన శైలిలో విచారణ చేయాల్సిన పోలీసులు కేవలం నోటీసు ఇచ్చి పంపించడం పైనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

ఇదిలా ఉండగా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేసింది. కడప జిల్లాలో మరో సీఐను కూడా సస్పెండ్ చేయగా కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ఈ రోజు రాత్రి లేదా రేపటి లోపు వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. ఇతని పైన కడప పులివెందుల రాజంపేట మంగళగిరి తో పాటు హైదరాబాదులో కూడా కేసులున్నాయి. వర్రా రవీందర్ రెడ్డి పై దాదాపు 30 వరకు కేసులు నమోదై ఉంటాయని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఘటన పైన ఇంటెలిజెన్సీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం.

పులివెందులలో వర్రా ప్రత్యక్షం- దర్జాగా జగన్​ క్యాంప్​ ఆఫీస్​లోనే - YSRCP Social Media Activist Varra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.