ETV Bharat / state

సాంకేతికపరమైన అంశాల విచారణ పూర్తి - ఇక ఆర్థికపరమైన శాఖలపై ఫోకస్​ చేయనున్న పీసీ ఘోష్​ కమిషన్ - JUSTICE GHOSE on KALESHWARAM

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 7:08 AM IST

Updated : Jul 14, 2024, 7:19 AM IST

Justice PC Ghose Commission on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇక ఆర్థికపరమైన శాఖలపై దృష్టి సారించనుంది. సాంకేతికపర అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియకు కమిషన్ సిద్ధమవుతోంది. అధికారుల గణాంకాలతో పాటు కాగ్ నివేదిక ఆధారంగా ఆర్థిక పరమైన అంశాలపై విచారణ చేయనుంది. గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వారందరి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత తదుపరి చర్యలను కమిషన్ చేపట్టనుంది.

Justice PC Ghose Commission
Justice PC Ghose Commission on Kaleshwaram (ETV Bharat)

Justice PC Ghose Commission on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మూడు బ్యారేజీల్లోని లోపాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ తొలుత దృష్టి సారించింది. అందులో భాగంగా అక్కడ ప్రస్తుతం ఉన్న, గతంలో విధులు నిర్వర్తించిన ఇంజినీర్లను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. ఆనకట్టల పనులు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణ చేసిన కమిషన్, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది.

ఆర్థిక పరమైన అంశాలపై విచారణ : ఆ సమయంలో సాంకేతిక అంశాలపై కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే తమ అధ్యయన నివేదికను సమర్పించింది. అందులోని కొన్ని అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ మరింత వివరణ కోరారు. మూడు ఆనకట్టలకు అనుబంధంగా పంపుహౌస్‌లు ఉన్నందున అక్కడి ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారణ చేసింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి సమాచారం, అన్ని వివరాలను అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే నీటి పారుదల శాఖను ఆదేశించారు.

ఇంజినీర్ల నుంచి సమాచారం : జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికలను పరిశీలించారు. తుది నివేదికలు ఇవ్వాలని వారికి ఇప్పటికే స్పష్టం చేశారు. విశ్రాంత ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు ఇతర ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, వివరాలు సేకరిస్తోంది. వివిధ సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లు, అందులోని అంశాల ఆధారంగా తదుపరి సాక్ష్యాల నమోదు, బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతోంది.

సాంకేతికపరమైన అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో ఆర్థికపర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే నీటి పారుదల శాఖలోని గణాంక అధికారులతో పాటు వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌ను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్, వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలోనే ఆడిట్ నివేదిక ఇచ్చారు. కమిషన్‌కు ఆ నివేదిక అధికారికంగా అందింది.

కమిషన్‌ క్రాస్ ఎగ్జామినేషన్ : ఆ నివేదిక ఆధారంగా ఆర్థికపరమైన విచారణ చేపట్టేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. కాగ్ అధికారులను జస్టిస్ ఘోష్‌ విచారణకు పిలవనున్నారు. విచారణ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారుల నుంచి సమాచారం, వివరాలు సేకరించనున్నారు. సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కమిషన్ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికారికంగా ఎక్కడా లేకున్నా, మూడు ఆనకట్టల్లో 50 నుంచి 60 మంది వరకు సబ్‌ కాంట్రాక్టర్లు పని చేసినట్లు కమిషన్‌కు సమాచారమున్నట్లు తెలిసింది. నిర్మాణ సంస్థల లావాదేవీలను లోతుగా పరిశీలిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వచ్చిన అఫిడవిట్లు, సమాచారం ఆధారంగా కమిషన్ బహిరంగ విచారణ, సాక్షులను కమిషన్‌ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.

3 ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు - కొందరు గత ప్రభుత్వ పెద్దలకు దగ్గరి వారు! - PC Ghosh Commission Inquiry Update

పీసీ ఘోష్​ కమిషన్ - కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ఇంజినీర్ల విచారణ పూర్తి - inquiry on kaleshwaram project

Last Updated : Jul 14, 2024, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.