ETV Bharat / state

వాడవాడలా రామోజీరావుకు అశ్రు నివాళులు- పుష్పాంజలి ఘటించిన పాత్రికేయలోకం - Journalists Pay Tribute to Ramoji Rao

Journalists Pay Grand Tribute to Ramoji Rao in All Over AP: ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆయనకు నివాళులర్పించారు. మీడియా రంగంలో ఆయనొక ధ్రువతారగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్భంగా రామోజీరావు చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.

tribute_to_ramoji_rao
tribute_to_ramoji_rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 5:02 PM IST

Journalists Pay Grand Tribute to Ramoji Rao in All Over AP: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు అకాల మృతితో ఆయన అభిమానులు వాడవాడలా నివాళులు అర్పిస్తూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. నెల్లూరు జర్నలిస్టు భవన్ లో రామోజీ చిత్ర పటానికి జర్నలిస్టులు నివాళులు అర్పించారు. జర్నలిజం ద్వారా ప్రజా చైతన్యానికి ఎనలేని కృషిచేసిన రామోజీరావు లేని లోటు తీరనిదని వారు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పత్రిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన రామోజీ భావితరాలకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు రామోజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావు చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.

వాడవాడలా రామోజీరావుకు అశ్రు నివాళులు- పుష్పాంజలి ఘటించిన పాత్రికేయలోకం (ETV Bharat)

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి పత్రిక, మీడియా రంగానికి తీరని లోటు అని జమ్మలమడుగు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో జమ్మలమడుగులో మౌనర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఆర్డీఓ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ అక్షర యోధునిగా రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం తెలుగు ప్రజలకే కాకుండా దేశానికే తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు - Chandrababu Tribute to Ramoji

అక్షర యోధుడు రామోజీరావుకి అనంతపురంలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్​లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామోజీరావు ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. పత్రికా రంగంలో రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని పుట్టించిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు. ఇవాళ పలు పత్రికల్లోనూ, మీడియా సంస్థల్లోనూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రామోజీరావు మృతి ఈనాడు కుటుంబ సభ్యులకు తీరని లోటు అని అనంతపురంలో ఈనాడు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈనాడు కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన దయతోనే ఇవాళ లక్షల కుటుంబాలు బతుకుతున్నాయని గుర్తు చేసుకున్నారు. తాము ఉన్నంతవరకు ఆ మహనీయుడిని మర్చిపోలేమని చెప్పారు.

'నా పట్ల మీరు చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస - ఇక సెలవు' - తెలుగువారికి రామోజీ చివరి లేఖ - RAMOJI RAO LETTER TO TELUGU PEOPLE

స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్న రామోజీ - Media Mogul Ramoji Rao Smruthi Vanam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.