ETV Bharat / state

జేఈఈ మెయిన్స్​కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్​ న్యూస్! - JEE MAIN EXAM 2025

జేఈఈ మెయిన్ -2025 నోటిఫికేషన్ విడుదల - జనవరి 22 నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభం - రెండో విడత పరీక్షలు ఏప్రిల్​ 1 నుంచే - సిలబస్​లో లేని మార్పులు

JEE Main 2025 Schedule Out
JEE Main 2025 Schedule Out (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 4:41 PM IST

Updated : Oct 30, 2024, 4:55 PM IST

JEE Main 2025 Schedule Out : దేశవ్యాప్తంగా ఎన్​ఐటీల్లో బీటెక్​/ బీఆర్కే సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్​-2025 ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఎన్​టీఏ(NTA) అక్టోబరు 28న ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం అవ్వనున్నాయి. అలాగే రెండో విడత పరీక్షలు ఏప్రిల్​ 1 నుంచి జరగనున్నాయి. కానీ గతేడాదితో పోల్చితే ఈసారి మాత్రం 40 రోజులు ఆలస్యంగా ప్రకటనను విడుదల చేశారు. ఈసారి అందరినీ ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే పరీక్షల ఫలితాల తేదీలను కూడా ప్రకటించారు. ఈసారి కూడా సిలబస్​లో ఎలాంటి మార్పు లేదని నోటిఫికేషన్​ను చూస్తే అర్థం అవుతుంది. పరీక్షల విషయానికి వస్తే గతేడాది జనవరి 24న పరీక్షలు జరగ్గా ఈసారి రెండు రోజులు ముందుకు జరిపి నిర్వహించడం విశేషం.

పరీక్షల షెడ్యూల్ :

తొలి విడత

  • ఆన్​లైన్​ దరఖాస్తులు : అక్టోబరు 28 నుంచి నవంబరు 22 వరకు
  • హాల్​ టికెట్లు డౌన్​లోడ్ : పరీక్షకు మూడు రోజుల ముందుగానే.
  • పరీక్షలు నిర్వహణ : జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య(2025)
  • ఫలితాలు : ఫిబ్రవరి 12.

రెండో విడత

  • ఆన్​లైన్​ దరఖాస్తులు : జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు
  • హాల్​ టికెట్లు : పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు
  • పరీక్షలు : ఏప్రిల్​ 1 నుంచి ఏప్రిల్​ 8 మధ్య(2025)
  • ఫలితాలు : ఏప్రిల్​ 17 నాటికి.

అర్హత : అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

(2023,2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2025లో వయసుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ-2025(మెయిన్) పరీక్షకు హాజరుకావచ్చు.)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

తెలంగాణ : హైదరాబాద్​, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్​నగర్​, నిజామాబాద్​, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, వరంగల్.

ఆంధ్రప్రదేశ్​ : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్టణం, సూరంపాలెం, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి.

  • దరఖాస్తు నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు.

పరీక్ష నిర్వహణ ఇలా :

  • గత రెండేళ్ల మాదిరిగానే ప్రశ్నాపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఇందులో ఈసారి సెక్షన్​-బిలో 5 ప్రశ్నలు మాత్రమే.
  • గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్ మాత్రం ఉండదు.
  • రెండు సెక్షన్లలో మైనస్​ మార్కులు ఉంటాయి.
  • సరైన సమాధానం రాస్తే 4 మార్కులు వస్తాయి. తప్పు సమాధానం అయితే మైనస్​ 1 మార్కు ఇస్తారు.
  • ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
  • పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహణ.(ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది)
  • పేపర్​-1కు 300 మార్కులు, పేపర్​-2కు 400 మార్కులు.
  • దరఖాస్తులో మొబైల్ నంబరు, ఈ-మెయిల్ చిరునామా విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించినది ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా సమాచారం ఉంటే వారికి ఎన్​టీఏ పంపుతుంది.
  • ఎన్​టీఏ స్కోరు కోసం ముందుగా మ్యాథ్స్​, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్​ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మాత్రం తక్కువ మైనస్​ మార్కుల ప్రకారం సీటు ఇస్తారు.

జేఈఈ మెయిన్ ఎందుకు నిర్వహిస్తారు? :

  • దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్​ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్​ఐటీల్లో 8,500లకు పైగా బీటెక్​ సీట్లు ఉన్నాయి. వీటిని జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు.
  • ఐఐటీల్లో బీటెక్​లో చేరాలంటే మెయిన్​లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్​డ్​ రాయాలి.
  • జేఈఈ మెయిన్​లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్​డ్​ పరీక్ష రాసేందుకు అర్హత.
  • ఎన్​ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
  • ఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్​ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి.
  • బీఆర్క్​, బీ ప్లానింగ్​లో ప్రవేశించేందుకు పేపర్​-2, బీటెక్​ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష జరుగుతాయి. ఇందులో బీఆర్కేకు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. ఈ పరీక్షను తొలి రోజునే నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచే పేపర్​-1 నిర్వహిస్తారు.

ఛాయిస్​ ఎత్తివేత : కొవిడ్​ నేపథ్యంలో విద్యార్థులకు ప్రతి సబ్జెడ్​లో ఛాయిస్​ రూపంలో ఇచ్చిన వెసులుబాటును ఎన్​టీఏ ఎత్తివేసింది. జేఈఈ మెయిన్​ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్​ బీలో ఈ ఛాయిస్​ కొనసాగింది. ఇప్పుడు ఈ ఛాయిస్​ను ఎత్తివేశారు.

జేఈఈ షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు సహా ఫలితాల తేదీలు​ ఎప్పుడెప్పుడంటే?

జేఈఈ, నీట్​ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే?

Last Updated : Oct 30, 2024, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.