ETV Bharat / state

JEE మొయిన్స్‌లో అదరగొట్టిన తెలుగు విద్యార్ధులు - 100 పర్సంటైల్‌లో సగం మనోళ్లే - JEE Main 2024 Session 2 Results Out - JEE MAIN 2024 SESSION 2 RESULTS OUT

JEE Main 2024 Session 2 Results Released: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్‌ రాగా, ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉండటం గమనార్హం. జేఈఈ మెయిన్స్‌ తుది ఫలితాలను బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు.

JEE Main 2024 Session 2 Results Released

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 9:40 AM IST

Updated : Apr 25, 2024, 10:05 AM IST

JEE Main 2024 Results Released : జేఈఈ మెయిన్స్‌ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్‌ రాగా, ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు చెందిన 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాలను ఎన్‌టీఏ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ సైతం ప్రకటించింది.

జేఈఈ మెయిన్స్​లో 100 పర్సంటైల్‌ సాధించినవారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఆంధ్రప్రదేశ్​ నుంచి ఏడుగురు ఉన్నారు. ఫలితాలతోపాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు, కటాఫ్‌ను జాతీయ పరీక్షల విభాగం వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ పరీక్షను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతలుగా నిర్వహించారు. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్‌ జాబితాకు పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల - క్వాలిఫై అయిన అభ్యర్థులు వీరే! - Group 2 Results

JEE Main 2024 Session 2 Results Out : రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 8,22,899 మంది పరీక్షలకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్‌లో విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్‌కు జాతీయస్థాయిలో 9వ ర్యాంకు లభించగా, కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి జాతీయస్థాయిలో 14, ఈడబ్ల్యుఎస్‌లో మొదటి ర్యాంకు వచ్చాయి. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డికి జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌లో మూడో ర్యాంకు లభించాయి. ఇదే జిల్లాకు చెందిన తోటంశెట్టి నిఖిలేష్‌కు జాతీయస్థాయిలో 21వ ర్యాంకు లభించింది.

100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు.. 1 హందేకర్‌ విదిత్‌ (తెలంగాణ), 2 ముత్తవరపు అనూప్‌ (తెలంగాణ), 3 వెంకటసాయి తేజ మదినేని (తెలంగాణ), 4 రెడ్డి అనిల్‌ (తెలంగాణ), 5 రోహన్‌సాయి పబ్బ (తెలంగాణ), 6 శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి (తెలంగాణ), 7 కేసం చెన్నబసవరెడ్డి (తెలంగాణ), 8 మురికినటి సాయి దివ్యతేజరెడ్డి (తెలంగాణ), 9 రిషి శేఖర్‌ శుక్లా(తెలంగాణ), 10 తవ్వ దినేశ్‌రెడ్డి (తెలంగాణ), 11 గంగ శ్రేయాస్‌ (తెలంగాణ), 12 పొలిశెట్టి రితీశ్‌ బాలాజీ (తెలంగాణ), 13 తమటం జయదేవ్‌రెడ్డి (తెలంగాణ), 14 మరువు జస్విత్‌ (తెలంగాణ), 15 దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి (తెలంగాణ), 16 చింటు సతీశ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), 17 షేక్‌ సూరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 18 తోటంశెట్టి నిఖిలేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 19 తోట సాయికార్తిక్‌ (ఆంధ్రప్రదేశ్‌), 20 మురసని సాయి యశ్వంత్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), 21 మాకినేని జిష్ణుసాయి (ఆంధ్రప్రదేశ్‌), 22 అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌)

రిజర్వేషన్కటాఫ్ మార్కులు
జనరల్93.236
ఈడబ్ల్యూఎస్81.326
ఓబీసీ79.675
ఎస్సీ60.092
ఎస్టీ49.627
పీడబ్ల్యూడీ0.001

Top Entrance Exams 2024 Schedule : దేశంలో 2024లో జరిగే టాప్ ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ ఇవే.. మీ పరీక్ష ఎప్పుడో చూసుకోండి..!

ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల - అర్ధరాత్రి రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ - AP Group1 Prelims Results Released

ఇండియాలోని అత్యంత కఠినమైన పరీక్షలు​ ఇవే! పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? - TOP 9 Toughest exams in India

JEEమొయిన్స్‌లో అదరగొట్టిన తెలుగు విద్యార్ధులు -100 పర్సంటైల్‌లో సగం మనోళ్లే

Last Updated : Apr 25, 2024, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.