Janasena Party Fund Cheques: రాజకీయ పార్టీలకు పలు రకాలుగా విరాళాలు వస్తుంటాయి. విరాళాల ద్వారా వచ్చిన నిధులే కొంతవరకు పార్టీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తాయి. ఇలా పార్టీని బలోపేతం చేసేందుకు దోహదం చేసే విరాళల చెక్కులను జనసేనాని నిరాకరించారు. అసలు ఆయన విరాళాల చెక్కులను ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది. చెక్కులను నిరాకరించడానికి కారణాలు ఏమై ఉంటాయి.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపీస్తున్న వేళ రాజకీయ పార్టీలకు విరాళాల చెక్కులు రావడం సాధారణమే. ఇటీవల పార్టీకి విరాళాలు అందిస్తున్నామని కొందరు వ్యక్తులు జనసేనకు చెక్కులు అందించారు. అయితే చెక్కులు ఇచ్చిన వారిలో ఇంతకముందే పార్టీలో పనిచేస్తున్నవారు ఉన్నారు. వారితోపాటు ప్రస్తుతకాలంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నవారు కూడా ఉన్నారు. కొందరైతే పార్టీలో చేరని వారు వారు కూడా విరాళాల రూపంలో చెక్కులు అందించారు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలియడంతో ఆయన చెక్కుల అంశంపై అప్రమత్తమయ్యారు.
జనసేన ఎంత మందికి టికెట్లు ఇవ్వాలో హరిరామజోగయ్య శాసించడం సరికాదు: ఓవీ రమణ
చెక్కులు వెనక్కి పంపాలని ఆదేశాలు: పార్టీకి విరాళాల పేరుతో వస్తున్న చెక్కుల పట్ల అప్రమత్తత అవసరమని పార్టీ కార్యాలయ సిబ్బందికి సూచించారు. పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఇప్పుడు అధికంగా చెక్కులు రావడాన్ని ఆయన గమనించారు. ఈ క్రమంలో ఇటీవలే పార్టీలో చేరి చెక్కులు అందించి సీట్లు అభ్యర్థిస్తున్న వారి చెక్కులను వెనక్కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావ- టీడీపీలో చేరేందుకు నేతలు సిద్ధం: కేశినేని చిన్ని
పార్టీ కోసం పని చేసిన వారికే సీట్లన స్పష్టం: జనసేనాని ఆదేశాల మేరకు కార్యాలయ సిబ్బంది సదరు వ్యక్తులకు ఫోన్లు చేశారు. వారు అందించిన చెక్కులను తిరిగి తీసుకోవాలని కోరారు. ఈ విధంగా మంగళవారం ఒక్కరోజులోనే దాదాపు 7చెక్కుల వరకు తిరిగి వెళ్లాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్ప, కొత్తవారికి సీట్లు ఇచ్చేది లేదని పవన్ తేల్చి చెప్పారు. అందుకోసమే చెక్కులను వెనక్కి పంపించినట్లు తేల్చి చెప్పారు.
గత అనుభావాల దృష్ట్యా: విరాళం ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత టికెట్ ఆశిస్తున్నారని పవన్ దృష్టికి వచ్చింది. విరాళాల చెక్కులు అందించిన తర్వాత సీట్లు రాకపోతే, డబ్బులకు సీట్లు అమ్ముకున్నారనే ప్రచారానికి కొందరు సిద్ధమైనట్లు అనుమానాలు ఉన్నాయని పవన్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రజారాజ్యం అనుభావాల దృష్ట్యా ఇప్పుడు చెక్కులను వెనక్కు పంపినట్లు సమాచారం.
మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్