ETV Bharat / state

వైఎస్సార్సీపీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు - ఓటర్లుకు డబ్బు పంచి వేళ్లపై సిరా గుర్తు - Naga Babu Comments On YCP Party

Janasena Leader Nagababu Serious Comments On YCP Party : జనసేన పార్టీ నేత నాగబాబు వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్​కు ఒకరోజు ముందు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు పంపిణీ చేసేందుకు ప్లాన్​ వేశారని, డబ్బులు తీసుకున్న ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లు సీరా మార్కు వేయాలని ఆలోచిస్తున్నారని వెల్లడించారు. దీంతో 13వ తేదీన వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారని నాగబాబు మండిపడ్డారు.

Janasena Leader Nagababu Serious Comments On YCP Party
Janasena Leader Nagababu Serious Comments On YCP Party (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 4:33 PM IST

వైఎస్సార్సీపీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు - 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని వెల్లడి (ETV Bharat)

Janasena Leader Nagababu Serious Comments On YCP Party : జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ జరగటానికి ఒకరోజు సమయం ఉండటంతో వైఎస్సార్సీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇచ్చేందుకు ప్లాన్​ వేశారని, వైఎస్సార్సీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ వెళ్లి డబ్బులు అందజేయడంతోపాటు డబ్బులు తీసుకున్న ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సీరా మార్కు వేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఫలితంగా 13వ తేదీన వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారని నాగబాబు మండిపడ్డారు.

బీ కేర్​ఫుల్​ విత్​ వైఎస్సార్సీపీ - ఓటుతో వాళ్లకు బుద్ది చెప్పాలి: నాగబాబు - Nagababu Comments on YSRCP

ఓటర్లు పోలింగ్ బూత్​కు వెళ్లినా అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం : ప్రతి ఓటరు డబ్బులు తీసుకుని ఇంట్లోనే ఉండేలా వైఎస్సార్సీపీ నేతలు భయపెడుతున్నారని అన్నారు. పిఠాపురం వంటి నియోజకవర్గంలో భారీగా డబ్బులు ఇచ్చి వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం పన్నారన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్​కు వెళ్లినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసే విధంగా అమాయక ప్రజలను వైఎస్సార్సీపీ నేతలు మళ్లీ మోసం చేస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజలు డబ్బులు తీసుకుంటారా? లేదా? అనేది వారి వ్యక్తిగతమని, కానీ ఎవరూ కూడా సిరా చుక్కను వేస్తామంటే తిరస్కరించాలని కోరారు. మీ మనస్సు చెప్పిన విధంగా మంచి పాలన అందించే వారికే ఓటు వేయాలని సూచించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయని నాగబాబు హెచ్చరించారు.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం : ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 75 శాతం నాశనం అయ్యిందని విమర్శించారు. ఇంకోసారి జగన్​కు అధికారం ఇస్తే రాష్ట్రం ఎప్పటికి కొలుకోదని హెచ్చరించారు. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలన్నారు. కానీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ఎదురించి మాట్లాడలేరని తెలిపారు. కాని ఓటు ద్వారా వైఎస్సార్సీపీకి సరైన బుద్ధిచెబుతారని తెలిపారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని వెల్లడించారు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలే రాజ్యామేలు తున్నాయన్నారు. గతంలో జగన్ ఇచ్చిన హామిలన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పుడు మరోసారి నీతిమాటలు చెబుతు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు. కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూటమి నేతలకు ఓట్లు వేసి భారీ మోజర్టీతో గెలిపించాలని నాగబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జగన్ ఉద్యోగులతో పాటు పోలీసులను దగా చేశారు: నాగబాబు - Nagababu responded on Police issues

గ్లాసు తేనీటి విందునిస్తుంది, ఫ్యాను రెక్కలు విరిగితే ఎందుకూ పనికి రాదు : నాగబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.