Pawan Kalyan Tribute to Ramoji Rao: రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నానని పేర్కొన్నారు. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వారే అని... ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు రామోజీరావు అని పవన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారని కొనియాడారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నారు. జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రామోజీ అండగా నిలబడ్డారు. తెలుగురాష్ట్రాలకు వేలాది మంది జర్నలిస్టులను అందించారు. జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నా. రామోజీ కుటుంబసభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి.
రామోజీరావు పార్ధివదేహానికి చంద్రబాబు నివాళి - Tribute to Ramoji Rao
రామోజీ ఇచ్చిన స్పూర్తితోనే ఈనాడు ఉద్యోగి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాను- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు