ETV Bharat / state

"భూమి నీదైతే నిరూపించుకో" ! - వెర్రిపప్పా.. అంటే 'బుజ్జినాన్నా' అని అర్ధం  ! - Jana Sena Prudhvi Raj Ad Viral - JANA SENA PRUDHVI RAJ AD VIRAL

Jana Sena Prudhvi Raj Ad Viral : ఏపీలో పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రచార కార్యక్రమాలు మరింత హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ పాలనపై జనసేన రూపొందించిన ఓ టీజర్ తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోకు వివిధ వర్గాల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇంతకీ, ఆ టీజర్​లో ఏముందో మీరే చూసేయండి.

JanaSena_Prudhvi_Raj_Ad_Viral
JanaSena_Prudhvi_Raj_Ad_Viral
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 8:49 AM IST

Updated : Apr 23, 2024, 9:30 AM IST

Jana Sena Prudhvi Raj Ad Viral on Social Media : ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల సమరం రోజురోజుకూ పదునెక్కుతోంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Jana Sena) పార్టీ రూపొందించిన ఓ టీజర్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

"భూమి నీదే, రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. అయితే ఏంటి, భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైసీపీ నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు, కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది?" అనే ఇతివృత్తంతో ఈ టీజర్​ను రూపొందించింది జనసేన. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్​లో 'ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో అన్నదాతల తలరాతలు ఎలా మారబోతున్నాయో, రాత్రికి రాత్రే భూముల్ని ఎలా కొట్టేస్తారో' అనే అంశాన్ని వివరించారు.

"ఎంత అధికారం మీదైతే మాత్రం రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారా?" అని సామాన్య పౌరుడు ప్రశ్నిస్తే, "నిజమే అయితే నువ్వేం చేయగలవు" అని ఎదురుదాడి చేసే ప్రజాప్రతినిధి తీరు అధికార దురాగతాలకు అద్దం పడుతోంది. ఇందులో ప్రజాప్రతినిధి పాత్రలో సినీ యాక్టర్ పృథ్వీ నటించారు. "చెమటలు పడుతున్నాయా, ఫ్యాన్‌ వేయమంటావా?" అని పృథ్వీ అడిగితే "ఐదేళ్లు వేసింది చాలయ్యా" అని సామాన్యుడి పాత్రధారి సాగనంపే రీతిలో సమాధానమిస్తారు. అప్పుడు "ఇలాంటి వారిని మనమేమీ చేయలేమా" అని ఆవేదన వ్యక్తం చేసే సామాన్యుడి కుమార్తె ప్రశ్నకు ఓటుతోనే సమాధానం చెప్పగలమనే సందేశాన్ని ఇచ్చారు.

మూడు పార్టీల కలయిక శుభపరిణామం - కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు - CHIRANJEEVI SUPPORTS NDA

మేం తెచ్చిన చట్టమే.. అధికారీ మావాడే! :

వైరల్ అవుతున్న ఆ టీజర్​లో "ల్యాండ్‌ టైట్లింగ్‌ అనే కొత్త చట్టాన్ని తెచ్చింది మా ప్రభుత్వమే. అక్కడ టైటిల్‌ రిజిస్టర్డ్‌ అధికారి (టీఆర్‌వో) అని ఒకరుంటారు. ఎవరైనా రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే కోర్టుకెళ్లే వీలు ఉండదు. టీఆర్‌వో దగ్గరకెళ్లి మీ భూమి మీదే అని నిరూపించుకోవాలి" అని పృథ్వీ చెప్పే సంభాషణలు అధికారపక్ష నేతల అరాచక శైలిని ప్రతిబింబించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. " టీఆర్​వో అధికారిని ఏర్పాటు చేసేదే ప్రభుత్వమైనప్పుడు, ఆయన ప్రభుత్వంలోని నేతల మాటే వింటాడుగానీ రైతుల గోడు పట్టించుకుంటారా" అనే ప్రశ్నలూ సంధిస్తారు పృథ్వీ. "మా ప్రభుత్వంలో భూమి కబ్జాకు గురైతే ఎవరైనా చేయగలిగేదేమీ ఉండదు. ఎంతోకొంతకు సెటిల్‌ చేసుకోవడమే" అని అంటారు పృథ్వీ.

వెర్రిపప్పా.. అంటే 'బుజ్జినాన్నా' అని అర్ధం : భూమిని ఆక్రమించడమే కాకుండా, తమనేమీ చేయలేరని మితిమీరిన అహంకారంతో విర్రవీగే ప్రజాప్రతినిధి(పృథ్వీ) చివరకు ఆ సామాన్యుడిని ‘వెర్రిపప్పా’ అంటూ ఆ టీజర్​లో దూషిస్తారు. ఆ తర్వాత అదేమీ తిట్టు కాదని, వాడుక భాషలో 'బుజ్జినాన్నా' అని అర్థమని సమర్థించుకుంటారు ప్రజాప్రతినిధి.

సీఎం జగన్​ డ్రామాలు - ఒక గొడ్డలి, కోడికత్తి, ఇప్పుడు గులకరాయి: పృథ్వీరాజ్‌ - Prudhvi Comments On Jagan

Last Updated : Apr 23, 2024, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.