ETV Bharat / state

ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు - క్వారీలను పరిశీలించిన అధికారులు - Checking Sand Quary in Officers - CHECKING SAND QUARY IN OFFICERS

Irrigation Officer Checking At Sand Quarry: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది. వారు పరిశీలించిన ప్రదేశానికి సమీపంలోనే రాత్రి వేళల్లో రవాణాకు వీలుగా ఇసుకను కుప్పలుగా పోసి ఉంచినా వాటిని మాత్రం పట్టించుకోలేదు. తమ పరిశీలనలో తేలిన విషయాలను కలెక్టరుకు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.

Irrigation Officer Checking At Sand Quarry
Irrigation Officer Checking At Sand Quarry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 9:11 AM IST

ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు - క్వారీలను పరిశీలించిన అధికారులు (ETV Bharat)

Irrigation Officer Checking At Sand Quarry: ఇసుక రీచ్ల వద్ద అక్రమ తవ్వకాలపై కలెక్టరు ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, నాలుగు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ తవ్వకాలు ఆపేలా చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది.

ఇసుక రవాణా ట్రక్కులపై టార్పాలిన్ తప్పనిసరి- ఆ రెండు కంపెనీలకు హైకోర్టు నోటీసులు - SAND TRANSPORT

వారు పరిశీలించిన ప్రదేశానికి సమీపంలోనే రాత్రి వేళల్లో రవాణాకు వీలుగా ఇసుకను కుప్పలుగా పోసి ఉంచిన వాటిని మాత్రం పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మైనింగ్ డీడీ సుబ్రమ్మణ్యం దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చారు. రీచ్​లను పరిశీలించారు కదా, ఎక్కడైనా అక్రమ రవాణా విషయం గుర్తించారా? అని అడగ్గా, ఏ రీచ్​లోనూ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినట్లు కనిపించలేదన్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు రెండు క్యారీల్లో తవ్వకాలు జరగట్లేదని నిర్ధారించారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, తమ పరిశీలనలో తేలిన విషయాలను కలెక్టరుకు నివేదిక అందిస్తామని తెలిపారు.

గోదావరిలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్ - పట్టించుకోని అధికారులు - Illegal Sand Mining in Rajahmundry

గణత్కూరులో ఇసుక అక్రమ తవ్వకాలపై తర్వాత పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. చిత్తూరు సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాసులు గనులు, భూగర్భ శాఖ, పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, జలవనరులు, రవాణా శాఖ అధికారులతో కలిసి ఓజీ కుప్పం రీచ్‌ను పరిశీలించారు. అనుమతి గడువు ముగిసినా ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండటంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇకపై ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పరిసర గ్రామాల్లో చాటింపు వేయాలని తహశీల్దార్‌ని ఆదేశించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు - ఇసుక రీచ్​ల బాట పట్టిన కలెక్టర్లు - COLLECTORS INSPECTION

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.