IPL 2024 : ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదే క్రికెట్ లెజెండ్ మహేంద్రసింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఉద్దేశంతో అభిమానులు స్టేడియానికి క్యూకట్టారు. ఈ క్రమంలో స్టేడియానికి చేరుకున్న క్రికెట్ అభిమానులు టికెట్లు ఉన్న లోపలికి అనుమతించడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sunrisers Hyderabad vs Chennai Super Kings : దీంతో ఉప్పల్ స్టేడియంలోని గేట్ నంబరు 4 వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గేట్ దగ్గర ఉన్న బారికేడ్లను తోసేసిన అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. అయితే ఇక్కడ పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సిబ్బంది ఒక్కొక్కరిని గేటు ద్వారా లోపలికి పంపిస్తున్నారు. ఉప్పల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.
ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. టీఎస్‌ఆర్టీసీ సైతం మ్యాచ్ కోసం ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియానికి క్యూ కడుతున్నారు.