Cyber Investment Frauds in Telangana : దేశవ్యాప్తంగా జరుతున్న సైబర్ నేరాల్లో పెట్టుబడుల పేరుతోనే అత్యధికంగా ప్రజలు సొమ్ము కాజేస్తున్నారు. అంతర్జాలమే ఆయుధంగా అమాయకులకు వల విసురుతూ, చిక్కిన వారిని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థకు హైదరాబాద్ సీఈఓగా పనిచేస్తున్న ఓ మహిళ, అంతర్జాలంలో ఏదో సమాచారం కోసం వెతుకుతుండగా అకస్మాత్తుగా ఓ పాపప్ మెనూ వచ్చింది.
ఖరీదైన ఫోన్లు క్లియరెన్స్ సేల్స్ కింద అతి తక్కువ ధరకే అమ్ముతున్నామని, టోకుగా కొంటే ఇంకాస్త చౌకగా ఇస్తామని ఆ మెనూలో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఫోన్ల ఫోటోలు, వీడియోలు, గతంలో కొన్న వినియోగదారుల కామెంట్లు సైతం కనిపించాయి. నిజమేనని నమ్మిన సదరు మహిళ తన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫోన్ల కోసం రూ.20 లక్షలు చెల్లించింది. ఎంతకీ సరకు డెలివరీ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
Stock Market Fraud Case : ఇటీవల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మాములయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫారెక్స్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ పేరుతో పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్ధతిలో ఫోన్ వచ్చింది. ఫారెక్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, తమ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షల్లో కమీషన్ ఇస్తామంటూ రూ.73 లక్షలు తస్కరించారు.
మరోవైపు స్టాక్ బ్రోకర్ల పేరుతో జనాలు జేబులకు కత్తెరేస్తున్నారు. ఏ సంస్థ షేర్లు కొంటే లాభాలు వస్తాయో చెబుతామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారు. పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్లు నకిలీ లింకులు చూపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.36 లక్షలు కొల్లగొట్టారు.
Crypto Currency Fraud Case : క్రిప్టోకరెన్సీ వ్యాపారం బాగా ప్రాచుర్యం పొందింది. అధిక లాభాలు వస్తాయని చెబుతూ రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. వాట్సప్, టెలీగ్రామ్ల ద్వారా కేటుగాళ్లు ఫోన్లు చేస్తారు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. కొంత పెట్టగానే వెంటనే భారీగా లాభం వచ్చినట్లు చూపిస్తారు. కాని ఆ డబ్బును ఉపసంహరించునే అవకాశం ఉండదు. ఇలా నమ్మకం కలిగిన తర్వాత మరింత మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తారు. వీరి మాయలో పడి కాప్రా ప్రాంతానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగి రూ.76 లక్షలు పోగొట్టుకున్నాడు.
Ponzi Scam Fraud Case : వాట్సప్ నుంచి ఫోన్ వస్తుంది. తమకు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉందని, ఫలానా సంస్థలో సభ్యత్వం తీసుకొని, మరో పది మందిని చేర్పిస్తే కమిషన్ దండిగా ముడుతుందని నమ్మిస్తారు. చెప్పినట్లే మొదట్లో చేరిన వారికి భారీగానే లాభాలు ఇస్తారు. వీరిని చూపించి మిగతా జనం మీద వల విసురుతారు. చేరినవారు కూడా తమ పైవారికి వస్తున్న లాభాలు చూపి మరింత మందిని చేర్చుతారు. భారీగా వసూళ్లయిన తర్వాత నేరస్థులు మాయమవుతారు.
ప్రముఖ వాణిజ్య సంస్థల ఫ్రాంఛైజీలు ఇప్పిస్తామంటూ సై : ఇప్పుడు చాలా వాణిజ్య సంస్థలు ప్రాంచైజీలు ఇస్తున్నాయి. అంటే బాగా పెరుపొందిన సంస్థ కొత్త బ్రాంచి నడుపుకునేందుకు అనుమతి అన్నమాట. ఈ ప్రాంచైజీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రముఖ పిజ్జా లేదా ఐస్క్రీం సంస్థ ప్రాంచైజీ కావాలంటే రూ.లక్షల్లో చెల్లించాలి. సైబర్ నేరగాళ్లు తాము ఫలానా సంస్థ ప్రతినిధులమని అంతర్జాలం ద్వారా ప్రచారం చేసుకుంటారు.
ఆసక్తి ఉన్న వారు సంప్రదించగానే ప్రాంచైజీ ఇస్తామని నమ్మిస్తారు. సంబంధిత పత్రాలు పంపిస్తారు. డబ్బు చెల్లించగానే ఉడాయిస్తారు. కేఎఫ్‌సీ ప్రాంచైజీ ఇప్పిస్తామని చెబుతూ హైదరాబాద్లోని ఒక వ్యక్తి నుంచి ఇలా రూ.26.27 లక్షలు కొల్లగొట్టారు. గ్యాస్ డీలర్‌షిప్ ఇస్తామని చెబుతూ మరో మహిళ నుంచి రూ.45 లక్షలు దోచుకున్నారు.
పార్ట్ టైమ్ జాబ్ పేరిట సైబర్ వల : సైబర్ నేరగాళ్ల పంటపండించేది పార్ట్ టైమ్ జాబ్ పేరుతో జరుగుతున్న మోసాలే. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రచారం చేసుకుంటారు. నమ్మి వచ్చిన నిరుద్యోగుల నుంచి అందినకాడికి గుంచుకొని నకిలీ అప్పోయింట్మెంట్ ఆర్గర్లు కూడా ఇస్తారు. ఇందులో ప్రధానమైనవి లైకులు కొట్టి, రివ్యూలు రాస్తే కమిషన్ ఇస్తామనేవి.
గూగుల్ మ్యాపుల్లో వచ్చే వాణిజ్య సంస్థలకు లైకులు కొట్టి, రివ్యూలు రాస్తే డబ్బు ఇస్తామంటారు. చెప్పినట్లే ముందు కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత డిపాజిట్ చెల్లిస్తేనే కొత్త ఎస్సైన్మెంట్లు ఇస్తామంటారు. వందల్లో వచ్చే కమిషన్ ఆశకు రూ. లక్షల్లో డిపాజిట్ కడుతుంటారు. కమిషన్ వచ్చినట్లు చూపిస్తారు కాని దాన్ని ఖాతాలో జమచేయరు. ఎలాగూ కమిషన్ వచ్చిందికదా అని కొత్త ఎస్సైన్మెంట్ల కోసం కొత్తగా డిపాజిట్లు చెల్లిస్తూ రూ.లక్షల్లో మోసపోతుంటారు.
Cyber Crime Awareness : హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా రూ.84.9 లక్షలు పోగొట్టుకున్నాడు. పెట్టుబడులు పేరుతో జనవరి నుంచి ఇప్పటి వరకూ 7971 కేసులు నమోదు కాగా, రూ.286.85 కోట్లు సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేశారు. సత్వరమే మోసమని గ్రహించి 1930కి ఫోన్ చేసిన వారికి సంబంధిచి 38.25కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడగలిగారు.
ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు : ఇప్పుడు జరుగుతున్న అన్ని రకాల సైబర్ నేరాల్లో అగ్రస్థానం పెట్టుబడికి సంబంధించినవేనని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ అన్నారు. టెలిగ్రాం, వాట్సప్ గ్రూపుల ద్వారా నేరగాళ్లు తమ ప్రకటనలతో ఆకట్టుకుంటారని, వీటికి ఆశపడి వారితో సంప్రదింపులు మొదలుపెడితే ఇక అంతే సంగతి అని చెప్పారు. వారు చూపించే లాభాలు, షేర్లు అన్నీ కంప్యూటర్ మీద కనిపిస్తాయని కానీ, డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరని శిఖాగోయల్ తెలిపారు.
లాభాలు డ్రా చేసుకోవాలంటే పన్నులు కట్టాలని మరింత వసూలు చేస్తారని శిఖాగోయల్ వివరించారు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి, ఇక పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించే వరకూ ఈ మోసం కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి నేరాల ద్వారా రోజూ రూ.2 కోట్ల వరకు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. షేర్లు కొనుగోలు చేయాలంటే ఆయా సంస్థల అసలు వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని శిఖాగోయల్ సూచించారు.
01-01-2023 నుంచి 31-12-2023 వరకు రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం వారీగా వార్షిక సైబర్ నేరాల నివేదిక ఇదే
Sl. No. | State | No of Complaint Reported | Amount Reported (Rs in Lacs) | No of Complaints (Put on Hold) | Lien Amount (Rs in Lacs) |
1 | Andaman & Nicobar | 526 | 311.97 | 161 | 26.46 |
2 | Andhra Pradesh | 33507 | 37419.77 | 9580 | 4664.14 |
3 | Arunachal Pradesh | 470 | 765.79 | 127 | 34.39 |
4 | Assam | 7621 | 3441.8 | 2163 | 451.61 |
5 | Bihar | 42029 | 24327.79 | 11533 | 2779.41 |
6 | Chandigarh | 3601 | 2258.61 | 1058 | 296.67 |
7 | Chhattisgarh | 18147 | 8777.15 | 5056 | 898.41 |
8 | Dadra & Nagar Haveli and Daman & Diu | 412 | 326.21 | 105 | 40.88 |
9 | Delhi | 58748 | 39157.86 | 13674 | 3425.03 |
10 | Goa | 1788 | 2318.25 | 450 | 153.22 |
11 | Gujarat | 121701 | 65053.35 | 49220 | 15690.9 |
12 | Haryana | 76736 | 41924.75 | 21178 | 4653.4 |
13 | Himachal Pradesh | 5268 | 4115.25 | 1502 | 370.78 |
14 | Jammu & Kashmir | 1046 | 786.56 | 253 | 62.55 |
15 | Jharkhand | 10040 | 6788.98 | 2822 | 556.38 |
16 | Karnataka | 64301 | 66210.02 | 18989 | 7315.52 |
17 | Kerala | 23757 | 20179.86 | 8559 | 3647.83 |
18 | Ladakh | 162 | 190.29 | 41 | 10.03 |
19 | Lakshadweep | 29 | 19.58 | 6 | 0.51 |
20 | Madhya Pradesh | 37435 | 19625.03 | 9336 | 1462.33 |
21 | Maharashtra | 125153 | 99069.22 | 32050 | 10308.47 |
22 | Manipur | 339 | 333.03 | 108 | 66.94 |
23 | Meghalaya | 654 | 424.2 | 252 | 46.71 |
24 | Mizoram | 239 | 484.12 | 75 | 35.44 |
25 | Nagaland | 224 | 148.94 | 73 | 18.09 |
26 | Odisha | 16869 | 7967.11 | 5187 | 1049.34 |
27 | Puducherry | 1953 | 2020.34 | 568 | 143.38 |
28 | Punjab | 19252 | 12178.42 | 4923 | 1332.66 |
29 | Rajasthan | 77769 | 35392.09 | 20899 | 3934.82 |
30 | Sikkim | 292 | 197.92 | 65 | 18.01 |