ETV Bharat / state

మందుబాబులకు గుడ్​న్యూస్ - నాణ్యతపై దృష్టి - ఎంఆర్​పీ మించి అమ్మితే 5లక్షలు ఫైన్ - LIQUOR QUALITY IN AP

మద్యం నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్

Liquor Quality Tests in AP
Liquor Quality Tests in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 12:06 PM IST

Liquor Quality Tests in AP : ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. జగన్‌ పాలనలో ప్రవేశపెట్టిన జే బ్రాండ్లకి గుడ్ బై చెప్పింది. ఇంతే కాకుండా త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే నాణ్యమైన మద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ప్రామాణికాల్ని రూపొందించినట్టు ఆబ్కారీ, మద్యనిషేధశాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.

ఇందుకోసం విభిన్న ప్రామాణికాలు నిర్దేశించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిషాంత్ కుమార్ వెల్లడించారు. గతంలో ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (ఈఎన్‌ఏ) నమూనాలను ఆరు రకాల పారామీటర్స్‌ మేరకు పరీక్షించేవారని చెప్పారు. ఈ విధానాన్ని పూర్తిగా మార్చినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్, బ్లెండ్‌లను పరీక్షించడానికి ‘గ్యాస్‌ క్రొమటోగ్రఫీ’ అనే అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

New Parameters in Liquor Quality : విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కాకినాడల్లోని రీజనల్‌ ప్రొబెషనరీ, ఎక్సైజ్‌ ల్యాబ్‌లలో ఈ పరీక్షలు అందుబాటులో ఉంటాయని నిషాంత్ కుమార్ వివరించారు. అన్ని రకాల బ్రాండ్‌లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పారామీటర్లను రూపొందించామని చెప్పారు. ఈఎన్‌ఏ పరీక్షించడానికి 13, బ్లెండ్‌ (విస్కీ, బ్రాందీ, వోడ్కా, జిన్‌) పరీక్షించడానికి తొమ్మిది పారా మీటర్లు నిర్ణయించామని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవలే మద్యం ధరల విషయంలో ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్​పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని తెలిపింది. ఎంఆర్​పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని చెప్పింది. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలిచ్చింది.

ఎట్టి పరిస్థితుల్లోను బెల్ట్ షాపులను అనుమతించవద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ.5 లక్షలు అపరాధ రుసుము విధించాలని పేర్కొంది. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని వివరించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మందుబాబులకు గుడ్​న్యూస్ - త్వరలో కొత్త బ్రాండ్లు, ధరల తగ్గింపు!

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన మద్యం సరఫరా - ఏమైందంటే !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.