Drugs in Medical Shops: గంజాయి, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి భారీ డ్రగ్స్ కంటైనర్ ఒకటి వచ్చి కలకలం సృష్టించింది. అటు తరువాత రాష్ట్రంలో నలుమూలల కాదేది అనర్హం అన్నట్లు అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా మత్తుపదార్దులు అందుబాటులో ఉంటున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ప్రజాసంఘాలు ఎంతగా నెల్తినోరు కొట్టుకుంటున్నా డ్రగ్స్ ను నిరోంధిచలేకుండా ఉన్నారు. అంతే కాకుండా గంజాయి విక్రయాలు కూడా బడి,గుడి అన్న బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి.
తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. అయినా సరే గంజాయి అక్రమ రవాణాకు అలవాడు పడిన వారు ఆగడం లేదు. నిత్యం కొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. రోజుకో కొత్త ప్లాన్‌తో తమ బిజినెస్ సాగిస్తున్నారు. దీంతో యువత వీటి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇక ఇప్పుడు తమ బిజినెస్ సాగించేందుకు మెడికల్ షాపులనే ఎంచుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అయితే ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా, విస్తుపోయే విషయాలు తెలిపాడు. లాడ్జిలతో పాటు మెడికల్ షాపులలో గంజాయితో పాటు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు.
ఇదీ జరిగింది: ప్రకాశం జిల్లా కంభంలో మత్తు పదార్ధాల విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి. గంజాయి కలిగి ఉన్న అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురంలో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి కంభంలో రెడ్డి లాడ్జిలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాడు.
అంతే కాకుండా కంభంలో కొన్ని మెడికల్ షాపులకు మత్తు పదార్థాలు విక్రయిస్తునట్లు చెప్పాడు. దీంతో సెబ్ పోలీసులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. రెండు మెడికల్ షాపుల నుంచి కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా షాపులపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంధ్య తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ బాలసుందర్రావు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు - ఇద్దరు మహిళలు అరెస్టు - illegal ganja in Visakhapatnam