Intermediate Student Suicide in Adilabad : సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేదనే మనస్తాపంతో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఒక లేఖ(Suicide Letter)ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన బాలుడు(17) పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోయాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది విద్యార్థిని లోపలికి అనుమతించలేదు. పరీక్ష రాయలేదనే మనస్తాపం చెందిన బాలుడు ఇంటికి తిరుగు పయనమవుతూ సాత్నాల ప్రాజెక్టు కట్ట మీదకు వెళ్లి నీటిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నాన్న నన్ను క్షమించు : స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు జాలర్లను నీటిలోకి దింపి విద్యార్థి ఆచూకీ కోసం వెతికారు. అనుమానం వచ్చి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా ఒక లేఖ లభ్యమైంది. ఆ లేఖలో 'నాన్న నన్ను క్షమించు' అంటూ ఉంది. అప్పటికే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. జాలర్లు విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా నిమిషం నిబంధనలతో విద్యార్థి బలవన్మరణానికి(Inter Student Suicide) పాల్పడ్డాడనే విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు, పోలీసులు పరీక్షా కేంద్రానికి వెళ్లి అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. సదరు సీసీ ఫుటేజీ చూసిన డీఐఈవో రవీందర్ సదరు విద్యార్థి పరీక్షా కేంద్రానికి రాలేదని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్
పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే వెళ్లండి : పరీక్షల సమయం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఒక అరగంట ముందు వెళితే బాగుంటుంది. ఇలా వెళ్లడం వల్ల ఒత్తిడి గురవకుండా ఉండి పరీక్ష రాసేటప్పుడు మైండ్ ప్రెస్‌గా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష కేంద్రాలకు లేట్‌గా వెళ్లకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అలాగే విద్యార్థులు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.
సూర్యాపేట గురుకులానికి చెందిన మరో విద్యార్థిని సూసైడ్ - అసలేం జరుగుతోందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన
ఉపాధ్యాయుడు మందలించాడని- అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మాహత్యయత్నం