ETV Bharat / state

నంద్యాల జిల్లా విద్యార్థి కిడ్నాప్​ ఘటనలో కీలక మలుపు - బావిలో లభ్యమైన మృతదేహం - kidnapped student has died

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 9:13 PM IST

Student kidnapped in Nandyal District has Died : నంద్యాల జిల్లాలో కిడ్నాప్​కు గురైన ఇంటర్ విద్యార్థి ఘటన మలుపు తిరిగింది. అనూహ్యంగా ఆత్మకూరు శివారులోని ఓ బావిలో శవమై కనిపించాడు. దీంతో యువకుడిని కిడ్నాప్ చేసిన వారే హత్య చేశారా? లేదంటే ఆత్మ హత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Student kidnapped in Nandyal District has Died
Student kidnapped in Nandyal District has Died (ETV Bharat)

Student kidnapped in Nandyal District has Died : నంద్యాల జిల్లాలో కిడ్నాప్​కు గురైన ఇంటర్ విద్యార్థి ఘటన మలుపు తిరిగింది. అనూహ్యంగా ఆత్మకూరు శివారులోని ఓ బావిలో శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహరంలో మూడు రోజుల క్రితం కాలేజీలో ఉన్న ఇంటర్ విద్యార్థి వహీద్​ను అతని స్నేహితులే కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా విద్యార్థి వహీద్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడి కోసం పోలీసుల గాలిస్తున్న క్రమంలో వహీద్ స్నేహితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, వహీద్ ఈరోజు సాయంత్రం అనూహ్యంగా ఆత్మకూరు శివారులోని ఓ బావిలో శవమై కనిపించాడు. దీంతో యువకుడిని కిడ్నాప్ చేసిన వారే హత్య చేశారా? లేదంటే ఆత్మ హత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాష ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. చివరికి వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మద్యం సేవించి వహీద్ పై దాడి చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదుచేశారు. వహీద్ స్నేహితులైన అస్మతుల్లా, వలి, అల్తాఫ్, విక్రమ్ అనే నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

నర్సు వేషంలో వచ్చిన మహిళా కిడ్నాపర్​- అర్థరాత్రి శిశువు అపహరణ - CHILD KIDNAPPING

అయితే తమ కుమారుడు కిడ్నాప్ అయ్యి మూడు రోజులైనా ఆచూకీ లభించలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడు కావాలంటూ తల్లిదండ్రలతోపాటు బంధువులు మూడు రోజులుగా పోలీసు స్టేషన్ వద్దే పడిగాపులు కాశారు. వహీద్ ఆచూకీ తెలపని పక్షంలో పోలీసు స్టేషన్ వద్దనే ధర్నా చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అస్మతుల్లా, వలి, అల్తాఫ్, విక్రమ్​లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. వహీద్ ను వాళ్లు కొట్టిన విషయం వాస్తవమేనని చెప్పారు. తర్వాత పట్టణంలో వదిలి వెళ్లినట్లు వారు చెబుతున్నారని వివరించారు. అయితే ఈరోజు సాయంత్రం అనూహ్యంగా ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో యువకుడిని కిడ్నాప్ చేసిన వారే హత్య చేశారా, లేదంటే ఆత్మ హత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఆలయ భూములపై కన్ను - పూజారి కిడ్నాప్! 12 రోజులు చిత్రహింసలు - PRIEST KIDNAP

"కడుపున మోయకున్నా కంటికిరెప్పలా చూసుకుంటున్నాం - మా బిడ్డల్ని మాకు దూరం చేయొద్దు" - FOSTER PARENTS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.