ETV Bharat / state

90 సెకన్ల​లో తప్పుల్లేకుండా 29 పదాలు - 'స్పెల్లింగ్​ బీ' పోటీల్లో తెలుగు సంతతి బాలుడి సత్తా - INDO AMERICAN BOY WINS SPELLING BEE - INDO AMERICAN BOY WINS SPELLING BEE

US Spelling Bee Winner 2024 : అమెరికాలో ప్రతి ఏడాది జరిగే స్పెల్లింగ్​ బీ పోటీల్లో మరోసారి తెలుగు తేజం అద్భుతమైన విజయాన్ని సాధించాడు. బృహత్‌ సోమ అనే భారతీయ అమెరికన్​ విద్యార్థి కేవలం 90 సెకన్లలో 29 పదాల స్పెల్లింగ్​లను తప్పుల్లేకుండా చెప్పి విజేతగా నిలిచాడు. విద్యార్థి తండ్రి స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా కావడం విశేషం.

American Spelling Bee Competition
Indian Origin Boy Win US National Spelling Test (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 12:49 PM IST

US Spelling Bee Champion 2024 : అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్‌ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత అమెరికన్‌ విద్యార్థుల హవా కొనసాగింది. 2024 స్క్రిప్స్‌ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి, కప్‌తో పాటు 50 వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన బృహత్‌ ప్రస్తుతం ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్‌ సోమ తెలంగాణలోని నల్గొండకు చెందిన వారు.

American Spelling Bee Competition : ఈ ఏడాది స్పెల్లింగ్‌ బీ పోటీల్లో 245 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 8 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇందులో బృహత్‌ సోమ, ఫైజన్‌ జాకీ మధ్య టై ఏర్పడింది. టై బ్రేకర్‌గా ఇద్దరికీ 90 సెకన్ల సమయాన్ని నిర్వాహకులు కేటాయించారు. ఇందులో జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా, బృహత్‌ 29 పదాల స్పెల్లింగ్​లను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్‌ పొందాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్‌ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును ప్రస్తుతం బృహత్‌ అధిగమించాడని నిర్వాహకులు తెలిపారు.

యూఎస్​ 'స్పెల్లింగ్ ​బీ' పోటీల్లో ఈసారీ మనదే జోరు.. హరిణికి టైటిల్​

12 Years Boy Won US Spelling Test : స్పెల్లింగ్‌ బీ పోటీల్లో బృహత్‌ పాల్గొనడం ఇది మూడోసారి. 2022లో 163వ స్థానాన్ని చేరుకోగా, గతేడాది 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది టైటిల్‌తో సత్తా చాటాడు. టై బ్రేకర్‌లో ఓడిన జాకీకి 25 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ లభించింది. ఇక ఈ పోటీల్లో శ్రేయ్‌ పరీఖ్‌ 2వ, అనన్య రావు ప్రసన్న మూడో స్థానాల్లో నిలిచారు. అమెరికాలో జాతీయ స్పెల్లింగ్​ బీ పోటీలు 1925 నుంచి నిర్వహిస్తున్నారు. 1999 నుంచి ఇప్పటివరకు 29 మంది ఇండియన్‌- అమెరికన్‌ విద్యార్థులు ఇందులో ఛాంపియన్లుగా

నిలిచారు.

అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా 14 ఏళ్ల దేవ్​ షా.. బహుమతి ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.