India Today Axis My India Exit Poll Over AP Results : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని, ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా తేల్చిచెప్పింది. ఇప్పటికే దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా చేరింది.
టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా ఎన్డీఎ కూటమికి 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ పోస్ట్పోల్స్ ప్రకటించింది. ఇక అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకు మాత్రం 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. అలానే కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 సీట్లు సాధిస్తుందని తెలిపింది.
ఏపీలో అధికారం కూటమిదే : ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్నందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఎగ్జిట్ పోల్స్ అంనచాలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ లెక్క ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే 95 నుంచి 110 స్థానాలు గెలుచుకోనుంది.
కూటమి మిత్రపక్షాలైన జనసేన 14 నుంచి 20 సీట్లు, బీజేపీ 2 నుంచి 5 సీట్లు దక్కించోవచ్చని తెలిపింది. ఇక అధికార వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాలకే పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది! సార్వత్రిక ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే లెక్కలు వేసింది. తెలుగుదేశం 13 నుంచి 15, జనసేన 2, కమలం పార్టీ 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనుండగా, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.
AP Exit Poll Survey : ఇక రైజ్ అనే సర్వే సంస్థ కూడా కూటమికే పట్టం కట్టింది. తెలుగుదేశం కూటమి 113 నుంచి 122 స్థానాలు గెలుచుకనుండగా, వైఎస్సార్సీపీ 48 నుంచి 60 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోవడం ఖాయమని తేల్చిచెప్పింది. ఇక లోక్‌సభ స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 20, వైఎస్సార్సీపీ 7 నుంచి 10 సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడించింది.
గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్నదుంకుటుందంని చెప్పిన కేకే సర్వేస్ అనే సంస్థ సైతం ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది. కూటమిలో తెలుగుదేశం ఒక్కటే ఏకంగా 133 స్థానాలు కైవసం చేసుకోనుండగా, జనసేన 21, బీజేపీ 7 స్థానాలు గెలుకుటుంటాయని తెలిపింది. వైఎస్సార్సీపీ కేవలం 14 సీట్లతో దారుణ పరాభవాన్ని ఎదుర్కోబోతున్నట్లు అంచనా వేసింది. ఇక లోక్‌సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు కేకే సర్వేస్ తెలిపింది. వైఎస్సార్సీపీ ఒక్కటంటే ఒక్కసీటూ గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన2, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని.. వెల్లడించింది.
ఏపీలో అధికారం 'కూటమి'దే - వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వే - Andhra Pradesh Exit Poll 2024
మందు బాబులకు భారీ షాక్ - మూడు రోజులు వైన్స్ బంద్! - Wine Shops Close For 3 Days