Cyclone Dana Updates : వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపానుగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పారదీప్ (ఒడిశా)కు 260 కిలోమీటర్లు, ధమ్రా (ఒడిశా)కు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (బంగాల్) 350 కిలోమీర్ల దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమైంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉంది.
పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితర్‌కనికా-ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి.
దానా తుపాన్ ఎఫెక్ట్ - 200కు పైగా రైళ్లు రద్దు - పలు పరీక్షలు వాయిదా!