Illegal Products Frauds In Hyderabad : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లోని ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాము ముంబై పోలీసులమని మీపేరు మీద వచ్చిన పార్శిల్‌లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయని గోప్యంగా ఉంచడానికి రూ. 19 లక్షల 39 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆర్మీ పేరుతో దోపిడీ.. సైబర్ నేరగాళ్ల నయా మోసాలు
Cyber Cheating Illegal Products In Hyderabad : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. అతను అప్రమత్తతతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల బాధితుడికి ఇటీవలె సైబర్ నేరగాళ్లు ముంబయి పోలీసులు అని చెప్పి కాల్ చేశారు. అతని ఆధార్ వివరాల ద్వారా పార్శిల్ వచ్చిందని నమ్మించారు. ఆ పార్శిల్‌లో అక్రమ ప్రొడక్ట్స్ వచ్చాయని వాటిని ముంబయి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
అతన్ని స్కైప్ కాల్ ద్వారా విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో భయంతో బాధితుడు స్కైప్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. సైబర్‌నేరగాళ్లు సీబీఐ, ఆర్బీఐ డాక్యుమెంట్స్‌తో ముంబయి పోలీసుల యూనిఫార్మ్స్, ఐడీ కార్డ్స్‌తో విచారణ చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతామని బాధితుడిని నమ్మించారు. ఈ కేసులో ఎన్ఓసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు రూ. 19 లక్షల 39 వేలు పంపించాలని డిమాండ్ చేశారు. నగదు ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని నిమిషాల్లో రిఫండ్ చేయబడుతుందని నమ్మబలికారు.
నగదు లావాదేవీలు చేస్తున్నారా..? జాగ్రత్త వహించండి..!
Cyber Frauds In Hyderabad : ఈ వ్యవహారం అంత మోసమని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. అధికారులు ఎప్పుడు స్కైప్ ద్వారా కాల్స్ చేయరని ఇలా కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.