ETV Bharat / state

'ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరండి' - సీనియర్​ ఐఏఎస్​లకు హైకోర్ట్​ ఆదేశం

మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దు - స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదు : హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 29 minutes ago

IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC
IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC (ETV Bharat)

IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC : ఇటీవల డీవోపీటీ ట్రాన్స్​ఫర్​ చేసిన అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రొనాల్డ్​ రోస్​, సృజన, హరికిరణ్​, శివశంకర్​, ఆమ్రపాలి, వాణీప్రసాద్​, వాకాటి కరుణ డీవోపీటీ ఆర్డర్​లపై ధర్మాసనాన్ని ఆశ్రయించారు చేశారు. ఐఏఎస్​లు దాఖలు చేసిన పిటిషన్​ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది తెలపగా, అప్పటివరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌లు కోరారు.

ఈనెల 9న ఆ ఐఏఎస్​లకు డీవోపీటీ ఉత్తర్వులు : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ తెలంగాణకు రావాల్సి ఉంది. ఈ మేరకు డీవోపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ నలుగురు ఐఏఎస్​లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో పిటిషన్ వేశారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఏపీకి వెళ్లాలని క్యాట్​ తీర్పు : అయితే క్యాట్​లో నిన్న(మంగళవారం) విచారణ జరిపినా వీరికి ఊరట లభించలేదు. విచారణ సమయంలో క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని, అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని కూడా తెలిపింది. ఏపీకి వెళ్లాలన్న ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించి డీవోపీటీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఈ నలుగురు ఐఏఎస్​లో హైకోర్టులో లంచ్​మోహన్ పిటిషన్ వేశారు.

ఇదీ వివాదం : ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్​ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్​ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, సంతోశ్​ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్​కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్​ను తెలంగాణకు కేటాయించారు.

వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్​లను ప్రశ్నించిన క్యాట్​

క్యాట్​ను ఆశ్రయించిన ఐఏఎస్​లు - ఆమ్రపాలి సహా నలుగురు​ పిటిషన్​ దాఖలు

Last Updated : 29 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.