ETV Bharat / state

కూల్చివేతలపై హైడ్రా నివేదిక - లిస్టులో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు - ఎవరెవరివి ఉన్నాయంటే? - HYDRA REPORT ON DEMOLITIONS

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 2:42 PM IST

Updated : Aug 25, 2024, 5:17 PM IST

Hydra Report on Demolitions in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా వెల్లడించింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు చెందిన అనధికారిక నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది.

Hydra Report on Demolitions in Hyderabad
Hydra Report on Demolitions in Hyderabad (ETV Bharat)

Hydra Operations in Hyderabad : రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తోంది. ఈ క్రమంలో జూన్ 27 నంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది.

రాజకీయ నేతల ఆక్రమణలు : తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లతో పాటు పార్కు స్థలలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

అలాగే నందగిరి హిల్స్‌కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. బహదూర్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమ్ రూఖ్‌దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదస్తుల భవనాలు, ఒకటి రెండస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశామని హైడ్రా స్పష్టం చేసింది.

పారిశ్రామికవేత్తల నిర్మాణాలు : ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది. ఇక గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రోకబడ్డి యజమాని అనుపమలు ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది.

ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్‌టీఎల్‌లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. అలాగే మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది.

ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా తెలిపింది. అలాగే మన్సూరాబాద్‌లో 2 గుంటలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలా నగర్‌లో ఎకరా 4 గుంటలు, ఫిల్మ్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్‌ను కూల్చి వేసి 5 ఎకరాలు, గాజులరామారం మహాదేవపురం వద్ద ఒక గుంట స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది.

అలాగే గాజుల రామారాం భూదేవిహిల్స్‌లో ఎకరం ఒక గుంట, అమీర్‌పేటలో గుంట, చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం ఒకటి, నాలుగు అంతస్తుల భవనం రెండింటిని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడ్డుప్పల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదించారు.

హైడ్రా హడల్ - మూడో కంటికి తెలియకుండా అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA ENCROACHMENT DEMOLITIONS

60 గజాలైనా, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారం కూల్చివేయాలి : హైకోర్టు - TG High Court On Hydra Demolition

Last Updated : Aug 25, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.