ETV Bharat / state

హైడ్రా వాళ్ల జోలికి వెళ్లదు - కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA COMMISSIONER RANGANATH

'పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు - పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దు' : రంగనాథ్

hydra_commissioner_ranganath_comments
hydra_commissioner_ranganath_comments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2024, 2:59 PM IST

Updated : Dec 17, 2024, 4:35 PM IST

Hydra Commissioner Ranganath Comments on Demolitions : హైడ్రా కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని తెలిపారు. గతంలో పర్మిషన్‌ తీసుకొని ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న వారు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు హైడ్రా వెళ్లదని రంగనాథ్​ వివరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం కూల్చివేయడం తప్పదన్నారు.

కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పని చేస్తున్నామని కమిషనర్​ తెలియజేశారు. పేదల జోలికి హైడ్రా రాదని, వారి ఇళ్లను కూల్చివేస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రంగనాథ్‌ కోరారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కాముని చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మెరకు చెరువు కింది భాగంలో ఉన్న మైసమ్మ చెరువు వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలను నాలా మళ్లింపు స్థలాలను పరిశీలించారు. చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్​ఎంసీ (GHMC) అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు పాల్పడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో ధనవంతులే ఎక్కువ - ఎవరినీ ఉపేక్షించం: రంగనాథ్​

'స్థానికుల ఫిర్యాదు మేరకు కావలి చెరువు, కాముని చెరువులను పరిశీలించడానికి వచ్చాం. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తాం. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటివైపు వెళ్లం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు.' - రంగనాథ్​, హైడ్రా కమిషనర్

ఈ క్రమంలో ఆయన చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్​ఎంసీ అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువు ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు్ పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని​ తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ చేస్తోందన్నారు.

మనసు చంపుకొని ఇళ్లు కూల్చాల్సి వస్తోంది: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

Last Updated : Dec 17, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.