ETV Bharat / state

గూగుల్​ మ్యాప్​ సహాయంతో డ్రైవింగ్​ - తీరా చూస్తే కాలువలో కారు - Google Maps Takes Car into Stream - GOOGLE MAPS TAKES CAR INTO STREAM

Accidents Caused by Using Google Maps : గూగుల్ మ్యాప్స్​ సహాయంతో డ్రైవింగ్​ చేశారు తీరా చూస్తే ఆ రూట్​ నేరుగా నీటి ప్రవాహంలోకి తీసుకెళ్లింది. అయితే ఆ ప్రమాదం నుంచి నలుగురు క్షేమంగా బయటపడిన కారు మాత్రం మునిగిపోయింది. ఈ ఘటన కేరళలోని కొట్టయాం జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నది మన హైదరాబాద్​ పర్యాటకులు. అందుకే తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ కన్నా ఆ ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తులను నమ్ముకుంటే ఉత్తమం.

Accidents Caused by Using Google Maps
Accidents Caused by Using Google Maps (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 3:37 PM IST

Google Maps Takes Car into Stream in Kottayam : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అదీ కూడా సొంత వాహనం బైక్​ లేదా కారులో వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఇది లేటెస్ట్​ ట్రెండ్​గా కూడా మారిపోయింది. అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు రూట్​ గురించి ఉపయోగించే అస్త్రం గూగుల్​ మ్యాప్. ఇప్పుడు ఇదే గూగుల్​ మ్యాప్​ కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు నావిగేషన్​ సక్రమంగా చూపిస్తున్నా, కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాత్రం నావిగేషన్​ చూపించడం లేదు. దీంతో కొత్తగా వెళ్లే వారు నదులు, కాలువల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.

నావిగేట్​​ చేయడానికి గూగుల్​ మ్యాప్​లను ఉపయోగించడం వల్ల హైదరాబాద్​కు చెందిన ఒక పర్యాటక బృందం కేరళలోని నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ సంఘటన దక్షిణ కేరళ జిల్లాలోని కురుప్పంతర సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మహిళతో సహా నలుగురు సభ్యులు బృందం ఉంది. ఈ సంఘటన శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వారంతా క్షేమంగా బయటపడ్డారు.

స్థానికులు, కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​కు చెందిన ఓ నలుగురు సభ్యుల పర్యాటక బృందం కారులో అలప్పుళ ప్రాంతానికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి కురుప్పంతర వైపు వెళుతున్నారు. వారు గూగుల్​ మ్యాప్​ను ఉపయోగిస్తూ నావిగేట్​ చేసుకుంటూ వెళ్లారు. ఇంతలో కురుప్పంతర సమీపంలోకి వచ్చే సరికి భారీ వర్షం రావడంతో దారి కనిపించలేదు. గూగుల్ మ్యాప్​లో ఫాలో అవుతూ వెళ్లేసరికి కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి : వెంటనే స్థానికులు పోలీస్​ పెట్రోలింగ్​ యూనిట్​ వారిని గమనించి మహిళతో పాటు నలుగురిని రక్షించారు. కానీ కారు మాత్రం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఆ కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కురుప్పంతర పోలీస్​ స్టేషన్​ అధికారి తెలిపారు. పర్యాటకులకు ఈ ప్రాంతం గురించి తెలియని కారణంగా వారు గూగుల్​ మ్యాప్​ను ఉపయోగించి నావిగేట్​ చేస్తూనే నీటి ప్రవాహంలోకి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూసుకెళ్లిన వ్యాన్ : ఏడాది క్రితం సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టులోకి వ్యాన్​ దూసుకెళ్లింది. గూగుల్​ మ్యాప్స్​ చూసుకుంటూ రోడ్డు ఉందని భావించి ముందుకు వెళ్లాడు. తీరా చూస్తే నేరుగా ఆ వ్యాన్​ ప్రాజెక్టులోకి వెళ్లిపోయింది. డ్రైవర్​ను రక్షించిన స్థానికులు, వ్యాన్​ను కూడా కష్టం మీద బయటకు తీశారు. అందుకే సాంకేతికత గూగుల్​ మ్యాప్​ను ఉపయోగించే ముందు సాటి మనిషిని కూడా అడిగితే మంచిదని అభిప్రాయం.

గూగుల్ మ్యాప్స్ 'ఫాస్టెస్ట్ రూట్'​- మెట్లపైకి వెళ్లి ఇరుకున్న కారు!

భారత్​లోని ఈ పర్యటక ప్రాంతాలు గూగుల్​ మ్యాప్స్​కూ చిక్కవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.