ETV Bharat / state

కేబీఆర్ పార్కులో హోంగార్డు అరాచకం- ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లు - Home Guard Arrest In Hyderabad

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 7:24 PM IST

Home Guard Arrest In Hyderabad: హైదరాబాద్​లో ప్రేమజంటలే లక్ష్యంగా నగదు వసూళ్లకు తెరలేపిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి ఫిర్యాదుతో హోంగార్డుతో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Home_Guard_Arrest_in_Hyderabad
Home_Guard_Arrest_in_Hyderabad (ETV Bharat)

Home Guard Arrest In Hyderabad: హైదరాబాద్​లోని కేబీఆర్ పార్కు ముందున్న జీహెచ్ఎంసీ నడకదారిలో యువతీ యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హోంగార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ ఉద్యానం వద్ద పెట్రోలింగ్​ వాహనంలో ముద్దం శ్రీనివాస్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. యాదగిరి అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. నడకదారిలో యువతీ యువకులు జంటగా కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని అతడికి చెప్పాడు

యాదగిరి ప్రేమ జంటలు కనిపించగానే హోంగార్డుకు సమాచారం ఇస్తాడు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించి డబ్బు వసూల్ చేస్తాడు. ఇటీవల ఓ జంటను డబ్బివ్వాలని బెదిరించగా, అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అయితే ఏటీఎంలో డ్రా చేసి ఇవ్వాలని యువకుడిని బలవంత పెట్టడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని హోంగార్డుతో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు.

ఆదోని పోలీస్​స్టేషన్​లో ఇంటి దొంగ- ​రూ.5 లక్షలు కాజేసిన హోంగార్డు - home guard stole the money

విజయనగరం జిల్లాలో దారుణం - యువతిపై హోంగార్డు అత్యాచారం - home guard raped woman

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.